బడ్జెట్ గురించి బెస్ట్ రివ్యూ ఇదే !

బడ్జెట్ గురించి బెస్ట్ రివ్యూ ఇదే !

నేడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌వేశపెట్టిన బ‌డ్జెట్ పై సోష‌ల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జైట్లీ బ‌డ్జెట్ అద్భుత‌మ‌ని, బాగుంద‌ని కొంద‌రు....త‌ట‌స్థంగా ఉంద‌ని మ‌రి కొంద‌రు....బాగాలేద‌ని, ఛెండాలంగా ఉంద‌ని ఇంకొంద‌రు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇలా నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా త‌మ అభిప్రాయాల‌ను కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ల‌న్నింటినీ సంక్షిప్తీక‌రించి నాలుగు కేట‌గిరీలుగా విభ‌సిస్తే ఈ విధంగా ఉంటుంది.

గ్రేట్ (గొప్ప‌గా ఉంది): నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా 10కోట్ల కుటుంబాలకు, సుమారు 50 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరడం, ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్‌మెంట్, రాబోయే నాలుగేళ్ల‌లో విద్యారంగానికి ల‌క్ష కోట్ల రూపాయ‌లు కేటాయించ‌డం, 2022 నాటికి అంద‌రికీ ఇళ్లు నిర్మించ‌డం.

గుడ్ (బాగుంది): దేశ రాజ‌ధానిని ప‌ట్టిపీడిస్తోన్న వాయు కాలుష్య నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక ప‌థ‌కం, మ‌రిన్ని మ‌రుగుదొడ్లు నిర్మించ‌డం, రైతుల‌కు ఒక‌టిన్న‌ర రెట్లు అధిక మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించ‌డం.

న్యూట్ర‌ల్ (త‌ట‌స్థం): ఎంపీల జీతాలు రెట్టింప‌వ‌డం, దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ ప‌న్ను  

బ్యాడ్ (బాగోలేదు): ఉద్యోగుల జీతాల‌పై 1 శాతం అద‌న‌పు సెస్ వ‌డ్డింపు, కార్పొరేట్ ల‌కు 5 శాతం ప‌న్ను త‌గ్గింపు

అగ్లీ (దారుణం): దేశంలో అత్య‌ధిక శాతం ఉన్న మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు ఎటువంటి లాభం చేకూర‌క‌పోవ‌డం, క‌స్ట‌మ్ సుంకం 20 శాతం పెర‌గ‌డం, ఫోన్లు,స్మార్ట్ వాచ్ లు, బూట్లు, దుస్తుల ధ‌ర‌లు ఆకాశాన్నంట‌డం.

నోట్ : ఈ బ‌డ్జెట్ లో గొప్ప‌గా, బాగా ఉన్న అంశాల‌ను భ‌విష్య‌త్తులో ప్ర‌జ‌లు గుర్తుంచుకుంటార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు