ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వారికి అక్క‌డే ఉంచుతార‌ట‌

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వారికి అక్క‌డే ఉంచుతార‌ట‌

ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అర్థం కాని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ఇప్ప‌టికే సిరియా ఇష్యూలో ఆయ‌న అనుస‌రిస్తున‌న వైఖ‌రిపై ప‌లు దేశాలు మింగుడుప‌డ‌ని రీతిలో మారింది. ఇలాంటి వేళ ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. అంత‌ర్యుద్ధంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న సిరియాకు చెందిన ఏడు వేల మంది అమెరికాలో నివ‌సిస్తున్నారు.

వారిని అమెరికాలోనే నివ‌సించేలా తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. మ‌ళ్లీ ఉత్త‌ర్వులు జారీ చేసే వ‌ర‌కూ ఏడు వేల మంది సిరియా ప్ర‌జ‌లు అమెరికాలో నివ‌సించేందుకు తమ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. మాన‌వ‌త్వ కోణంలో వారిని అమెరికాలో తాత్కాలిక ర‌క్ష‌ణ హోదాను క‌ల్పిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం వారి స్థితిని య‌థాత‌ధంగా మ‌రికొంత‌కాలం కొన‌సాగించ‌నున్నారు.

ఇప్ప‌టికే అమెరికాలో ఉన్న సిరియ‌న్ల‌ను ఓకే అన్న అమెరికా.. కొత్త‌గా వ‌చ్చే వారికి మాత్రం అనుమ‌తి ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. సిరియా శ‌ర‌ణార్థుల విష‌యంలో మాన‌వ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా చెప్పిన ట్రంప్ ప్ర‌భుత్వం.. మ‌రో ప‌ది దేశాల‌కు చెందిన శ‌ర‌ణార్థుల విష‌యంలోనూ పున‌రాలోచ‌న చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ట్రంప్ స‌ర్కారు తీసుకున్న తాజా నిర్ణ‌యంతో మ‌రో 18నెల‌ల పాటు సిరియ‌న్లు అమెరికాలో కంటిన్యూ అయ్యే అవ‌కాశం ఉంది.  వాస్త‌వానికి 2007లో అమెరికా అధ్య‌క్షుడు ఒబామా శ‌ర‌ణార్థుల ప్ర‌వేశానికి అనుమ‌తి ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వ‌చ్చాక దానిపై నిషేధం విధించారు. తాజాగా దాన్ని స‌వ‌రిస్తూ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు