హెచ్‌1బీః ట్రంప్ చెప్పిన‌ గుడ్ న్యూస్

హెచ్‌1బీః ట్రంప్ చెప్పిన‌ గుడ్ న్యూస్

భారతీయ ఐటీ వృత్తి నిపుణులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ గుడ్ న్యూస్ తెలిపారు. వీసా లాటరీ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. దీంతో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఈ విధానం అనుకూలంగా ఉండనుంది. ఇప్పటివరకూ డైవర్సిటీ వీసా లాటరీ పేరుతో ఏటా 50వేల మందికి వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వేల మంది భారతీయ వృత్తి నిపుణులకు ఎంతో మేలు జరుగుతుంది.గురువారం(జనవరి25) ట్రంప్ సర్కార్ వలసల సంస్కరణలపై చట్టం తీసుకురావడానికి చేసిన నాలుగు ప్రతిపాదనలలో ఇది ఒకటి. శ్వేతసౌధం తాజాగా రూపొందించిన ప్రతిపాదనను సెనెట్ కు అందిస్తామని, సెనెట్ మెజార్టీ నేత మిచ్ మెక్ కన్నెల్ దాన్ని వచ్చే నెల 6లోగా కాంగ్రెస్ లో ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు.

అమెరికాలో ప్రస్తుతం హెచ్‌1బీ వీసాలో మార్పుల విషయమై దుమారం చెలరేగుతోంది. వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ తరుణంలో ఇద్దరు రిపబ్లికన్‌ సెనెట్‌లో ఓ కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు. హెచ్‌1బీ వీసా పరిమితిని పెంచాలని ఇద్దరు రిపబ్లికన్‌ సెనెట్‌ బిల్లులోని సారాంశం. ఆరిన్‌ హాచ్‌, జెఫ్ప్‌ ఫ్లాక్‌లు ది ఇమ్మిగ్రేషన్‌ ఇన్నోవేషన్‌ యాక్ట్‌ -2018 పేరుతో ఈ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, హెచ్‌1బీ వీసాలో తీసు కొచ్చే మార్పుల కారణంగా అమెరికాలో అడుగు పెట్ట లేకపోతున్నారని, దీనికితోడు పరిమితి కూడా ఓ కార ణం అని ఇద్దరు రిపబ్లికన్‌ సెనేటర్లు సభలో వివరించారు. పరిమితి పెంచితే అమెరికాకు ఎంతో ఉపయో గకరంగా ఉండటంతో పాటు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పరిమితి పెంచడంతో ఉద్యోగులకు ఎంతో ఊరట లభిస్తుం దని, న్యాయపరంగా వారు ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగానికి వెళ్లే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే వీలుంటుందని ఆరిన్‌ హాచ్‌, జెఫ్ప్‌ ఫ్లాక్‌లు వివరించారు.

ఈ బిల్లుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ అమెరికన్‌ కంపెనీలైన మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, వాణిజ్య రంగ సంస్థలు, యూఎస్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌తో పాటు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్‌ కూడా ఆమోదించాలని కోరుతున్నాయని వారు గుర్తు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే.. ప్రపంచంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఎక్కడ అయితే అమెరికన్‌ కార్మికులు తక్కువగా ఉన్నారో అక్కడ పరిశ్రమల కోసం హెచ్‌1బీ వీసా అందుబాటులోకి ఉందని పేర్కొన్నారు. హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్‌లో సంస్కరణలు, మోస పూరిత కుట్రలు తగ్గించి, వర్కర్లను కాపాడుతుందని, ఎక్కువ ప్రతిభా వంతులైన వర్కర్లకు గ్రీన్‌ కార్డు సౌలభ్యాన్ని పెంచు తుందని వారు సభలో వివరించారు. గతంలో కూడా కాంగ్రెస్‌ సెనేటర్లు బిల్లును రెండు సార్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అమెరికాకు ప్రతిభావంతుల అవసరం ఎంతో ఉందని గుర్తు చేశారు. మెరిట్‌ ప్రాతిపదికన వల సదారులను ఎన్నుకుంటే భవిష్యత్‌లో ఎంతో తోడ్ప తుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు అమెరికాలో కూడా ఉన్నాయని, హెచ్‌1బీ వీసాల పరిమితి పొడగింపుతో వివిధ రంగాల నిపుణు లతో టెక్నికల్‌ రంగంలో ఖాళీలు భర్తీ అవుతాయని ఆశా భావం వ్యక్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు