ఛీఛీ... ట్రంప్‌తోనా? నేనా?: నిక్కీహేలీ

ఛీఛీ... ట్రంప్‌తోనా? నేనా?: నిక్కీహేలీ

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి, భారత సంతతి మహిళ, భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలు కాదగ్గ మహిళ అయిన నిక్కీ హేలీ తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానమిచ్చారు. ట్రంప్, తనకు మధ్య పడక సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. తనలాంటి విజయవంతమైన మహిళపై ఇలాంటి ఆరోపణలు తగవన్నారు.

కాగా అమెరికా అధ్యక్షుడి ప్రయాణాల కోసం నిర్ధేశించిన ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో నిక్కీ హేలీ, ట్రంప్‌లు చాలాసేపు గడుపుతున్నారనీ ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ అనే పుస్తకంలో రచయిత మైఖేల్‌ వుల్ఫ్‌ రాశారు. దీంతో నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య అఫైర్ ఉందన్న ప్రచారం అమెరికాను కుదిపేసింది. ట్రంప్ తీరు కారణంగా ఇది నిజమే కావచ్చని చాలామంది నమ్మారు కూడా.

అయితే... హేలీ ఈ దుష్ర్పచారంపై క్లారిటీ ఇచ్చారు.  తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్‌ తో తన భవిష్యత్‌ గురించి చర్చించలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపలేదని స్పష్టం చేశారు. విజయవంతమైన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని అన్నారు. చివర్లో ఆమె ట్రంప్ బాగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English