సిఎం కిరణ్ హీరోనా, జీరోనా

సిఎం కిరణ్ హీరోనా, జీరోనా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హీరో అవుతాడా లేక జీరో అవుతాడా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ. నిజమే ఆయనకు హీరో అయ్యే అవకాశాలు ఎన్నున్నాయో జీరో అయ్యే అవకాశాలు కూడా అంతే ఉండడం ఈ చర్చకు అసలు కారణం. సరే ఇప్పటికయితే సిఎం కిరణ్ హీరోనే, ఆయన తాజాగా ఢిల్లీ వెళ్లి చూపించింది కూడా హీరోయిజమే, తిరిగి వచ్చాకా తన సన్నిహితులతో చెప్పింది కూడా మున్న్ముందు చూపేది హీరోయిజమే అని అనుకోవచ్చు. కానీ ఇంతటి హీరో కూడా జీరో అయ్యే అవకాశాలు వుండనే వున్నాయి. ఎందుకంటే, ఆయన ఢిల్లీ వెల్లి వచ్చాక కూడా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు అంటే దిగ్విజయ్, షిండే వంటి వారు కిరణ్ పార్టీకి వీరవిధేయుడు, పార్టీ మాట జవదాటడు, పార్టీ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తారు అన్నారు. అంతే కాదు రాష్ట్రంలోని కొందరు నేతల్లో కూడా అదే అభిప్రాయం ఉంది.

ఎక్కడో ఉన్న ఆయనను ఏ ఒక్కరి మద్దతు లేకున్నా ముఖ్యమంత్రిని చేసి, ఆతర్వాత చిరంజీవి, బొత్స, ఎందరో మంత్రులు సిఎం తీరును నిరసిస్తూ ఆయనను తొలగించాలని డిమాండ్ చేసినా కూడా సోనియా ఆయనను తొలగించలేదు. ఇదంతా ఒక ఎత్తయితే ఏకంగా ఇప్పుడు సోనియాను, హైకమాండ్ ను దుమ్మెత్తి పోసినా కూడా ఆయన విధేయుడు అంటూ వెనుకేసుకు వస్తున్నారు. అంటే ఆయన సమైక్యం ముసుగులో విభజనకు సహకరిస్తున్నాడు అని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తోంది.

అంతే కాదు సోనియా తన నిర్ణయంలో విజయం సాధించాలంటే తెలంగాణ బిల్లు అసెంబ్లీని విజయవంతంగా దాటాలి. సిఎం బయటకు ప్రదర్శిస్తున్న వైఖరి చూస్తే అది అసాధ్యం అనిపిస్తోంది.  మరి అలా విజయవంతంగా కనుక ఆయన బిల్లును అడ్డకున్నా, అడ్డగించే ప్రయత్నం చేసినా సీమాంద్ర సమైక్య హీరోగా మిగిలిపోతాడు.

కానీ ఇంకా చంద్రబాబు, జగన్ కలసి కిరణ్ ను అనమానిస్తూనే వున్నారు. కిరణ్ రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. కానీ ఇది వట్టి గాలి ఆరోపణా కాదా అన్నది బిల్లు అసెంబ్లీకి వచ్చేసరికి తెలుస్తుంది. అప్పడు కూడా కిరణ్ ఇలాగే స్థిరంగా సమైక్యం వైపు నిల్చుంటే, కచ్చితంగా చంద్రబాబు, జగన్ ల కన్నా గట్టి హీరో అనిపించుకుంటాడు. లేదూ, జారిపోతే, వారు ఆరోపించినట్లే జీరో అవుతాడు.

రాజకీయాల్లో తన నియోజకవర్గానికే పరిమితమై ఎవరికి తెలియని కిరణ్ విభజన పుణ్యమా అని ఏకంగా సీమాంద్రలో హీరోగా మారాడు. ఇంత మంచి అవకాశం ఏ రాజకీయ నాయకునికి వచ్చినా వదులుకుంటాడా, అలా వదులుకుంటే రాజకీయాల్లో అంత మూర్ఖుడు మరొకడు ఉండడు. అందువల్ల కిరణ్ హీరోగానే వుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English