రైలుతో సెల్ఫీ: పిచ్చికి పీక్ స్టేజ్

రైలుతో సెల్ఫీ: పిచ్చికి పీక్ స్టేజ్

ఇప్పుడు జనాలకు సెల్ఫీల క్రేజ్ బాగా ఎక్కువయిపోయింది. చిత్ర విచిత్రంగా సెల్ఫీలు తీసుకోవడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం ట్రెండ్ అయిపోయింది. సెల్ఫీ పిచ్చి కాన్సెప్ట్ తో  సినిమాలు కూడా వచ్చేస్తున్నాయంటే.. జనాలకు వీటిపై మోజు ఏ స్థాయిలో ఉందో చెప్పచ్చు.

సెల్ఫీ కోసం ప్రాణాలు కూడా కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే.. ఇక్కడే హైద్రాబాద్ లోనే జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోలేదు కానీ.. ప్రాణాల మీదకు తెచ్చేసుకున్నాడు శివ అనే వ్యక్తి. మెట్రో రైలు వెళుతుండగా ట్రాక్ పక్కనే నుంచుని పోజ్ ఇచ్చి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. హైద్రాబాద్ లోని భరత్ నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అయితే.. రైలు వేగం.. దాని పరిమాణం పై పూర్తిగా అవగాహన లేకపోవడంతో.. ఎంఎంటీఎస్ వచ్చి నేరుగా శివను ఢీ కొట్టేసింది.

రైలు వస్తున్న సంగతి అతనికి కెమేరాలో కనిపిస్తున్నా చివరి సెకన్ వరకు నవ్వుతూనే నుంచున్న తీరు చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ప్రస్తుతం ఈ శివ రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేకపోయినా.. తలకు.. చేతికి బలమైన గాయాలు తగిలినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. ఇలా రైల్వే ట్రాక్ పక్కకు వచ్చినందుకు గాను.. కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు శివ. అయినా రన్నింగ్ ట్రైన్ తో సెల్ఫీ ఆలోచన చేయడం.. సెల్ఫీ పిచ్చికి పీక్ స్టేజ్ అనుకోవచ్చేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు