ఇదో కొత్త పార్టీ.. చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా

ఇదో కొత్త పార్టీ.. చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా

దేశరాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) పేరు మారింది. అయితే.. ఆ పార్టీ ఈ మార్పు చేయలేదు. ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ నేతలు సీపీఐ పేరును మార్చేశారు. సీపీఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా అంటూ కొత్త అబ్రివేషన్ చెప్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిస్తామని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు ఇలా సీపీఐని విమర్శిస్తున్నారు. వైసీపీ నేత జోగి రమేష్ దీనిపై మాట్లాడుతూ... కమ్యూనిస్ట్ ఫార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నేతగా కాకుండా, చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా నేతగా రామకృష్ణ మాట్లాడుతున్నారని విమర్శించారు.

అంతేకాదు.. రామకృష్ణ చంద్రబాబుకు పూర్తిగా తొత్తుగా మారారని ఆయన ఆరోపించారు. రామకృష్ణ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయారని అనుకోవాల్సి ఉంటుందని అన్నారు. పనిలో పనిగా జోగి రమేశ్ టీడీపీ మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డిపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మంత్రులు కనీస జ్ఞానం లేకుండా మతితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు