పద్మావత్ కోసం స్కూల్ బస్సునీ వదల్లేదు

పద్మావత్ కోసం స్కూల్ బస్సునీ వదల్లేదు

పద్మావత్ సినిమా సినిమా విడుదల తరువాత ఎన్ని రికార్డులు తిరగరుస్తుందో గాని ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో జనాలను బయట తిరగనివ్వకుండా చేస్తోంది. గత కొంత కాలంగా సినిమా విడుదలపై అనేక వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చరిత్రను కించపరిచే విధంగా ఆ సినిమా ఉందని కర్ణి సేన హిందు సంఘాలు మండిపడుతున్నాయి. సినిమాలో రాజ్ పుత్స్ గురించి ఎంత గొప్పగా చెప్పినా.. వీళ్ళ ప్రొటెస్ట్స్ మాత్రం ఆగట్లేదు. రీసెంట్ గా  చిత్ర యూనిట్ సభ్యులు అన్ని భాషల్లో ప్రెస్ వారికి ప్రీమియర్ షోలు వేశారు.

సినిమాలో వివాదాలకు తావివ్వకుండా సినిమాను తెరకెక్కించారు. కానీ కర్ణి సేన ఏ మాత్రం ఆలోచించకుండా రోడ్లపైకి వచ్చి చాలా మంది అల్లర్లను సృష్టిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మధ్య ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ హర్యానా వంటి  రాష్ట్రాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే జనాలు బయటకి అడుగు కూడా పెట్టడం లేదు. అక్కడ వన్ మాల్స్ - హిమాలయ థియేటర్ల పై దాడులు చేసి థియేటర్స్ అద్దాలను ద్వంసం చేశారు. అంతే కాకుండా సమీపంలో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టి భారీ ఆస్థి నష్టాన్ని కలిగించారు. పోలీసులు వచ్చే లోపే పరిస్థితి అంతా చేయి దాటిపోయింది. దాదాపు 150 వాహనాలవరకు కాలి బూడిదైపోయాయి. చివరకు హర్యానాలో ఒక స్కూల్ బస్సుపై లోపల పిల్లలు ఉన్నా కూడా దాడి చేయడం కర్ణి సేన గూండాలకే చెల్లింది.

ఇక ఈ ఘటనల నేపద్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ ని అమలు చేశారు. ఇక మరికొంత మంది థియేటర్స్ యజమానులు అయితే పద్మావత్  సినిమాను ప్రదర్శించడం లేదని థియేటర్స్ ముందు బోర్డులు తగిలించారు.  జనవరి 26న విడుదల కాబోయే ఈ సినిమాను చూస్తే అర్థమవుతుందని కొందరు చెబుతున్నా చూడకముందే వారు ఆందోళనకు దిగడం వివాదస్పదంగా మారింది. మరి సినిమా చూశాక వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు