ప‌వ‌న్‌పై చెప్పుదాడి...ఫ్యాన్స్‌లో క‌ల‌క‌లం

ప‌వ‌న్‌పై చెప్పుదాడి...ఫ్యాన్స్‌లో క‌ల‌క‌లం

తెలంగాణలో పవన్ కల్యాణ్ యాత్ర సంద‌ర్భంగా క‌ల‌క‌లం రేగింది. ఓ వైపు ప‌వ‌న్ యాత్ర‌ జోరుగా సాగుతుంటే...ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే మాటల దాడి మొదలుపెట్టాయి. అదే స‌మ‌యంలో కొంత మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా తప్పుబట్టారు. అప్పుడు వ్యతిరేకించి.. తెలంగాణ ఇచ్చినందుకు 11 రోజులు అన్నం మానేసిన వ్యక్తికి.. ఇప్పుడు రాష్ట్రంలో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. ఇలా విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతున్న స‌మ‌యంలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఆయ‌న‌పై చెప్పు దాడి జ‌రిగింది.

తెలంగాణలో మూడో రోజు ఖమ్మం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఖమ్మం ఓపెన్ టాప్ వెహికల్ లో అభివాదం చేస్తూ రోడ్ షో చేశారు. తల్లాడ సెంటర్ దగ్గరకు వచ్చే సరికి.. ఓ గుర్తు తెలియని వ్యక్తి పవన్ పైకి చెప్పు విసిరేశాడు. అది సరిగ్గా వాహనం బానెట్ పై పడింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. పవన్‌కు చెప్పు తగలకపోవటంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. చెప్పు పడిన విషయం తెలిసిన వెంటనే పోలీసుల చుట్టుపక్కల గాలించారు. పవన్ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నించారు. జనవరి 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు