పోలీస్ బాస్..లేడీ పోలీస్ అఫైర్

పోలీస్ బాస్..లేడీ పోలీస్ అఫైర్

అత‌నో పోలీసు అధికారి. ఆమె ఏసీబీలో ఉన్న‌తాధికారిణి. ఏం జ‌రిగిందో ఏమో కానీ.. వారిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నారు. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన స్థానాల్లో ఉన్న వారే.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోవ‌టంతో కాదు.. ఈ ఇష్యూ ఇప్పుడు పోలీస్ స్టేష‌న్ కు.. మీడియాకు ఎక్కేసింది.

పోలీసుశాఖ‌లో సంచ‌ల‌నంగా మారిన ఈ వ్య‌వ‌హారంలోకి వెళితే.. ఏసీబీ ఏఎస్పీగా వ్య‌వ‌హ‌రిస్తున్న సునీత‌తో క‌ల్వ‌కుర్తి సీఐ మ‌ల్లికార్జున‌రెడ్డితో వివాహేత‌ర సంబంధం ఉంది. కేపీహెచ్ బీ ప‌రిధిలోని ఒక అపార్ట్ మెంట్లో సునీత ఉంటున్నారు. మ‌ల్కాజిగిరి లో నివాసం ఉండే క‌ల్వ‌కుర్తి సీఐ ఇద్దరిని మాదాపూర్ లో రెడ్ హ్యాండెడ్ గా సునీత భ‌ర్త ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా సునీత భ‌ర్త బంధువులు సీఐ మ‌ల్లికార్జున‌రెడ్డిపై దాడికి పాల్ప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గా.. సీఐ మ‌ల్లికార్జున రెడ్డిపై సునీత త‌ల్లి.. అత్త‌లు క‌లిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చి.. మీడియాలో రావ‌టంపై పోలీసు ఉన్న‌తాధికారులు ఆగ్ర‌హంగా ఉన్నారు. వీరిద్ద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటార‌ని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు