2019 ఎన్నిక‌ల వ్యూహం రెడీ...త‌మ్ముళ్ల‌కు చెప్పిన బాబు

2019 ఎన్నిక‌ల వ్యూహం రెడీ...త‌మ్ముళ్ల‌కు చెప్పిన బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నారు. 2019 ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలన్న దానిపై ఇప్ప‌టికే సిద్ధ‌మైన చంద్ర‌బాబు ఇదే విష‌య‌మై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తెలుగు దేశం సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబు నివాసంలో ఆసక్తికరంగా సాగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీలో అధినేత అనేక అంశాలపై నాయకులకు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఎలక్షన్‌ ఇయర్‌లో అనుసరించాల్సిన పొలిటికల్‌ వ్యూహం ఏంటి.. ఏ నాయకుడు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి వంటి అంశాలను స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా స‌మాచారంతో పాటుగా సీఎం చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ నేత‌లంద‌రికీ సంబంధించిన పూర్తి డాటా తన దగ్గర ఉందని వివ‌రించిన చంద్ర‌బాబు అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కోడిపందాల‌పై స‌మ‌న్వ‌య క‌మిటి స‌మావేశంలో పార్టీ నేత‌ల‌కు గ‌ట్టి  క్లాస్ తీసుకున్నారు చంద్ర‌బాబు. సంప్ర‌దాయం కోసం జనం పందాలు నిర్వ‌హించుకోవ‌డంలో త‌ప్పులేదు కానీ... తామే నిర్వ‌హిస్తామనే రీతిలో నేతలు మాట్లాడ‌టం స‌రికాద‌ని బాబు అన్న‌ట్లు స‌మాచారం. రానున్నది ఎన్నిక‌ల ఏడాద‌నే విష‌యాన్ని అంద‌రు గుర్తుంచుకోవాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగేళ్ల క‌ష్టంతో పార్టీ ప‌ట్ల సానుకూల‌ వాతావ‌ర‌ణం ఉంద‌ని.... దాన్ని అందరూ గ‌మ‌నించాల‌ని సూచించారు. ఇక ఆదివారం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న  పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌ల‌తో వ‌న్ డే వ‌ర్క్ షాప్ జ‌ర‌గ‌నుంది. ఈ విసృత స్దాయి స‌మావేశంలో పార్టీ నేత‌ల‌కు.. చంద్రబాబు గ‌ట్టిగా క్లాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని స‌మాచారం.  

వైసీపీ నుంచి కొంద‌రు వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నార‌ని ప‌లువులు మంత్రులు చెప్ప‌గా....స్దాని‌కంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటే కొత్త వారిని పార్టీలో చేర్చుకోవ‌చ్చ‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారని తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై కూడా కేంద్రం  సానూకూలంగా ఉంద‌ని... ఖచ్చితంగా నియోజ‌క‌వ‌ర్గాలు  పెరుగుతాయ‌ని అన్నారు. ఇటివ‌ల ప్ర‌ధాని మోడీతో స‌మావేశం సానూకూలంగా సాగింద‌ని.. గ‌తాని కంటే మోడీ ఈసారి అనుకూలంగా స్పందించార‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు