ట్రంప్‌కు కోపం తెప్పించిన ఫేక్ న్యూస్ ఇవే..

ట్రంప్‌కు కోపం తెప్పించిన ఫేక్ న్యూస్ ఇవే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అక్కడి మీడియా మధ్య సరైన సంబంధాలు లేవు. ఆయన అధ్యక్షుడు కాక ముందు నుంచి మీడియాతో ఆయనకు వైరమే. అనేక సందర్భాల్లో ఆయన మీడియాపై మండిపడ్డారు. అంతా తప్పుడే వార్తలే సృష్టిస్తున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ.  తాజాగా, ఆయన మరో అడుగు ముందుకేసి మీడియా సృష్టించిన ఫేక్ న్యూస్ ఇదీ అంటూ కొన్ని వార్తలను ప్రస్తావించారు. వాటన్నిటికీ ఫేక్ న్యూస్ అవార్డులిస్తున్నామని వెటకారమాడారు.

ప్రముఖ దినపత్రిక 'ద న్యూయార్క్ టైమ్స్' కు బెస్ట్ ఫేక్ న్యూస్ అవార్డును ట్రంప్ ప్రకటించారు. దీంతో పాటు సీఎన్ఎన్, ఏబీపీ న్యూస్, టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర సంస్థలను కూడా విజేతలుగా ప్రకటించారు. ఈ వివరాలను రిపబ్లికన్ పార్టీ అధికారిక వెబ్‌సైట్ జీవోపీ.కామ్‌కు చెందిన బ్లాగులో పెట్టారు. దీని గురించి ట్రంప్ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే ఆ వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది. జర్నలిజం రంగంలో తాను గౌరవించే గొప్ప జర్నలిస్టులు ఉన్నారని... కానీ మీడియా మాత్రం అవినీతి, కపటబుద్ధితో తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని మరో ట్వీట్ లో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్ ఫేక్ న్యూస్ లిస్టు ఇదీ..

* ద న్యూయార్క్ టైమ్స్: దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు

* ఏబీసీ న్యూస్: మార్కెట్ పతనంపై వదంతులు

* సీఎన్ఎన్: వికీలీక్స్ పత్రాల యాక్సెస్ ట్రంప్ కు, ఆయన కుమరుడికి ఉంది.* టైమ్: ఓవల్ కార్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అర్ధ విగ్రహాన్ని తొలగించారు.

* ద వాషింగ్టన్ పోస్ట్: ఫోరిడాలో నిర్శహించిన ట్రంప్ ర్యాలీలో జనాలే లేరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు