కామెడీ సినిమా.. 75 కోట్లతో విజువల్ ఎఫెక్ట్స్

కామెడీ సినిమా.. 75 కోట్లతో విజువల్ ఎఫెక్ట్స్

బాహుబలి.. 2.0.. పద్మావతి లాంటి సినిమాలకు భారీగా ఖర్చు చేయడంలో.. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ ఒక కామెడీ సినిమాకు రూ.75 కోట్లు పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చడమేంటో అర్థం కావడం లేదు. కానీ సాజిద్ నడియాడ్‌వాలా మాత్రం ‘హౌస్ ఫుల్-4’ కోసం అలాగే ఖర్చు చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.

‘హౌస్ ఫుల్’ సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన మూడు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయి. కొత్త ఏడాదిలో ‘హౌస్ ఫుల్-4’ మొదలవుతుందట. గత సినిమాల కంటే ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని.. ఇందులో కామెడీతో పాటు థ్రిల్ చేసే అంశాలు కూడా ఉంటాయని.. ఇండియాలో తొలిసారిగా ఒక కామెడీ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఉండబోతోందని.. ఇందుకోసమే రూ.75 కోట్లు ఖర్చు చేస్తామని.. ఎందుకంత ఖర్చు చేస్తున్నామన్నది తర్వాత తెలుస్తుందని సాజిద్ తెలిపాడు.

ఈ విషయంలో ‘బాహుబలి’.. ‘ది అవెంజర్స్’.. ‘వండర్ ఉమన్’ లాంటి సినిమాలతో తాము పోటీ పడబోతున్నామని అతనన్నాడు. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించే ఈ చిత్రం రెండు వేర్వేరు కాలాల్లో నడుస్తుందని.. ఇందులో భారీ తారాగణం ఉంటుందని తన బేనర్లో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందని అతనన్నాడు. ఈ చిత్ర దర్శకుడు.. ఇతర సాంకేతిక నిపుణులు.. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని సాజిద్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English