సారీ చెప్ప‌ను.. ప‌వ‌న్ ప‌ర్స‌న‌ల్స్ మాట్లాడ‌ను

సారీ చెప్ప‌ను.. ప‌వ‌న్ ప‌ర్స‌న‌ల్స్ మాట్లాడ‌ను

మీడియా సంస్థ‌ల ప‌నేంటి?  ప్ర‌జ‌ల‌కు స‌మాచారాన్ని అందించ‌టం. అంతేకానీ.. వివాదాలు.. గొడ‌వ‌ల విష‌యంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసి వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేయ‌టం ఎంత మాత్రం కాదు. కానీ.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌.. క‌త్తి మ‌హేశ్ వివాదం ఎపిసోడ్ పై స‌రికొత్త‌గా రియాక్ట్ అవుతున్నాయి కొన్ని మీడియా సంస్థ‌లు. మొన్న‌టిదాకా క‌త్తి తిట్ల‌ను అదే ప‌నిగా టెలికాస్ట్ చేయ‌ట‌మే కాదు.. స్టూడియోకి పిలిపించి.. గంట‌ల కొద్దీ ఇంట‌ర్వ్యూల మీద ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ఇష్యూ ఎంత పెద్ద‌ది చేయాలో అంత పెద్ద‌ది చేయ‌టం తెలిసిందే.

ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ క‌త్తికి మ‌ధ్య న‌డుస్తున్న వివాదాన్ని క్లోజ్ చేసేందుకు  ఈ నెల 15 వ‌ర‌కు టైం ఇవ్వాల‌ని మాట‌ల ర‌చ‌యిత కోన వెంక‌ట్ వ్యాఖ్యానించ‌గా.. త‌మ్మారెడ్డి త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూను క్లోజ్ చేయాల‌న్న ఆలోచ‌న కొన్ని మీడియా సంస్థ‌ల‌కు వ‌చ్చాయి. నిజానికి ఇందులోనూ స‌ద‌రు మీడియా సంస్థ‌ల స్వార్థం లేక‌పోలేదు.

తాము పెంచి పోషించిన వివాదాన్నిఎలా కంటిన్యూ చేయాలో అర్థం కాని వేళ‌.. రాజీ పేరుతో మ‌రికొన్ని రోజులు ఈ ఇష్యూను లైవ్‌లో ఉంచ‌టానికి వేసిన ఎత్తుగ‌డ‌గా చెబుతున్నారు. ఎందుకంటే.. తాను ఎవ‌రినైనా తిట్టొచ్చు.. త‌ప్పు ప‌ట్టొచ్చు కానీ త‌న‌ను మాత్రం ఎవ‌రూ ఏమీ అన‌కూడ‌ద‌ని చెప్పే క‌త్తి.. ప‌వ‌న్ ఫ్యాన్స్ కు సారీ చెప్ప‌టం అన్న‌ది ఉండ‌దు. అందుకే సారీ పేరిట మ‌రింత డ్రామాను పండిస్తూ. టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఏ వివాదం విష‌యంలోనూ ఇంత‌లా ఆస‌క్తి చూపించ‌ని కొన్నిమీడియా సంస్థ‌లు ఇప్పుడీ విష‌యం మీద ఇంత ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌టం వెనుక కార‌ణాలు రెండుగా చెప్పొచ్చు. ఒక‌టి ఈ ఇష్యూను కంటిన్యూ చేయ‌టం.. అదే స‌మ‌యంలో త‌మ‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ మండిపాటు నేప‌థ్యంలో తాము పెద్ద‌మ‌నిషిలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా క‌ల‌ర్ ఇవ్వ‌టం.

ఇదిలా ఉంటే.. రాజీ అంశంపై ఛాన‌ళ్లు ప్ర‌త్యేక చ‌ర్చ‌ను పెట్టారు. సంక్రాంతి పండ‌క్కి ఊరెళ్లిన క‌త్తి మ‌హేశ్ ను  ఫోన్ ఇన్ తీసుకోవ‌టం ద్వారా నాట‌కీయ‌త ఏ మాత్రం మిస్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. రాజీ ఎపిసోడ్ లో క‌త్తి వాద‌న ఏమిటంటే.. త‌న‌ను అంద‌రూ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అంటున్నార‌ని.. తానెందుకు సారీ చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. కాకుంటే ఇక‌పై ప‌వ‌న్ ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి మాట్లాడ‌న‌ని చెప్పారు. వ్య‌క్తిగ‌త విష‌యాల మీద ఎలాంటి కామెంట్స్ చేయ‌న‌న్నారు.

రాజ‌కీయంగా.. సినిమాల ప‌రంగా త‌న అభిప్రాయ‌ల్ని చెబుతాన‌న్నాడు. తాను పెట్టే పోస్టుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు బూతులు తిట్ట‌కుండా చేయ‌గ‌లిగితే చాలు.. తాను కోరుకున్న‌ది అదేనంటూ త‌న వాద‌న‌ను వినిపించారు. క‌త్తి మ‌హేశ్ ప్ర‌తిపాద‌న‌ను ప‌లువురు త‌ప్ప ప‌ట్టారు. నేను ఏమైనా అంటాను.. కానీ న‌న్ను మాత్రం ఎవ‌రూ ఏమీ అన‌కూడ‌దన్న తొండి వాద‌న‌ను వినిపించారు. దీనిపై నాటి హీరో రాంకీ రియాక్ట్ అయ్యారు. క‌త్తి త‌ప్పును సూటిగా ఎత్తి చూపించారు. ఇంత‌కీ ఆయ‌నేం చెప్పారంటే..

కామెంట్ చేసే ప్ర‌తిఒక్క‌డిని ప‌వ‌న్ అభిమాని అని ఎలా సర్టిఫైడ్ చేస్తారు? ఈ వివాదానికి తెర లేపింది క‌త్తి మ‌హేష్‌. ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్లు వారు అభిప్రాయాలు చెప్పిన‌ట్లే.. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వారు రియాక్ట్ కావ‌టం స‌హ‌జం. అలాంట‌ప్పుడు ఇష్యూ మ‌రింత ముద‌ర‌కుండా ఉండాలంటే తిరిగి రియాక్ట్ కాకుండా ఉండి ఉంటే ఈ గోలే ఉండేది కాదు. క‌త్తి మ‌హేశ్‌కే అంత ఇగో ఉంటే.. ల‌క్ష‌ల్లో ఉండే ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌రెంత ఇగో ఉండాలి? స‌రే.. అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా క‌త్తి తాను ఇక‌పై ప‌వ‌న్ ను టార్గెట్ చేయ‌న‌ని.. త‌న‌ను కూడా టార్గెట్ చేయ‌నంటూ ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్ని ఛాన‌ళ్లు తిరిగాడో.. అన్ని ఛాన‌ళ్ల‌కు వెళ్లి చెబితే ఈ వివాదంం ముగుస్తుంద‌న్నాడు. ఆ త‌ర్వాత కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ రియాక్ట్ అయితే తానే కాదు సినిమా ఇండ‌స్ట్రీ సైతం క‌త్తికి అండ‌గా నిలుస్తుంద‌న్నాడు.

అలాంటి ప‌రిస్థితే వ‌స్తే.. తాను సైతం ప‌వ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి మీ ఫ్యాన్స్ ఏమిటి.. ఇలా చేస్తున్నార‌ని అడిగి.. ఏదో ఒక‌టి చేయాల‌ని చెబుతాన‌న్నాడు. రాంకీ చేసిన ప్ర‌తిపాద‌న బాగానే ఉంద‌ని స‌గ‌టు జీవికి అనిపిస్తుంది.  కానీ.. క‌త్తికి అనిపించ‌దు క‌దా. దీనిపై క‌త్తి స‌సేమిరా అంటూ లైట్ తీసేసుకున్నాడు. క‌త్తికి.. ఆయ‌న‌కు ప్ర‌చారాన్ని క‌ల్పించే ఛాన‌ళ్ల‌కు కావాల్సింది ఇష్యూ మ‌రింత కాలం కొన‌సాగ‌ట‌మేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు