మందు తాగే మ‌హిళ‌ల రికార్డు చూశారా?

మందు తాగే మ‌హిళ‌ల రికార్డు చూశారా?

కేవ‌లం పురుషులే కాదండోయ్‌...మ‌హిళ‌లు..మద్యం తాగేస్తున్నారు. కారణం, ఏమైనా మందు తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా పెగ్గు తీసుకోవ‌డంలో వారో రికార్డు కూడా సృష్టించేశారు. దశాబ్దం కిందట ఉన్న జనాభాతో పోలిస్తే ఢిల్లీలో మందు తాగే పురుషుల శాతం తగ్గిపోగా, మహిళల శాతం పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో కొన్ని రాష్ర్టాలు ఢిల్లీనే మించిపోయాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఓ 60 ఏళ్ల‌ మహిళ మందుతాగి తడబడుతూ మాట్లాడారని, చాలామంది ఇలా మద్యానికి బానిసలవుతున్నారని ఢిల్లీలో.. మద్యం వ్యసనం వీడిన మహిళలకు తోడ్పడే శక్తి అనే సంస్థ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 35 మంది మహిళలున్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005-06 నుంచి 2015-16 వరకూ పదేళ్ల‌ వ్యవధిలో దేశంలో మద్యం తీసుకొనే ఆడ, మగవారి వివరాలను సేకరించింది. ఢిల్లీలో పురుష జనాభా ప్రకారం చూస్తే వారిలో మందుతాగే వారి శాతం తగ్గింది. అదేసమయంలో అక్కడి మహిళల జనాభాలో 2005-06లో 0.4 శాతం మంది మద్యం తాగేవారుండగా, 2015-16 నాటికి ఆ శాతం 0.7 శాతానికి పెరిగింది. ఛండీగఢ్, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, మిజోరం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోనూ మందు తాగే మహిళల సంఖ్య అధికమైంది. మణిపూర్, గోవా, కేరళ రాష్ర్టాల్లో మందు తీసుకొనే మహిళల నిష్పత్తి ఢిల్లీలో కంటే కూడా ఎక్కువగా ఉంది. పెళ్లి చేసుకొని మోసపోవడంతో తాగుడుకు బానిసయ్యానని, ఆ తర్వాత 18 ఏళ్లుగా మద్యానికి దూరంగా ఉంటున్నానని ముగ్గురు కుమార్తెలకు తల్లి అయిన ఢిల్లీకి చెందిన నేహా(55) తెలిపారు. మందుతాగడం అనేది ఓ ప్రైవేటు వ్యవహారమని చెప్తున్నారు.

ఢిల్లీలోని ఫోర్టిస్ దవాఖానకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ సమీర్ పారిఖ్ మాట్లాడుతూ మద్యం వ్యసనం అనేది కూడా ఓ మానసిక సమస్యేనని  తెలిపారు. సాధారణంగా పురుషులు తీసుకొనే మద్యాన్ని ఇప్పుడు మహిళలు కూడా తీసుకుంటున్నారని చెప్పారు. కష్టాలు ఉన్నాయనే మందు తాగుతున్నామని 90శాతం మంది పురుషులు చెప్తున్నారు. అవే సమస్యలు ఉన్నప్పటికీ మహిళలు మాత్రం దీన్ని చెప్పుకోవడాన్ని అవమానంగా భావిస్తున్నారు అని ఢిల్లీలోని భారత ప్రైవేటు సైకియాట్రి సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ వీణా కపూర్ తెలిపారు.అయితే మ‌హిళలు మ‌ద్యం సేవించ‌డం పెరిగింద‌నేది గ‌మ‌నింప‌ద‌గిన విష‌య‌మ‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు