ప‌రిటాల పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య మాట ఇదే!

ప‌రిటాల పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య మాట ఇదే!

టీడీపీ దివంగ‌త నేత‌, మాజీ మంత్రి ప‌రిటాల రవీంద్ర హ‌త్య జ‌రిగి చాలా ఏళ్లే అయినా... ఆయ‌న జ్ఞాప‌కాలు ఇంకా జ‌నం మ‌దిలో మెద‌తూనే ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజంలో తొలి స్థానంలో నిలిచే అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ప‌రిటాల ర‌వీంద్ర‌ది చెర‌గ‌ని ముద్రే. తొలుత ర్యాడిక‌ల్ నేత‌గా, ఆ త‌ర్వాత స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంతో రాజ‌కీయ నేత‌గా మారిన ప‌రిటాల రవీంద్ర ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రంలో త‌న‌దైన ముద్ర వేశార‌నే చెప్పాలి. ఓ వైపు ఫ్యాక్ష‌న్ నేతగా ప‌రిటాల ర‌వీంద్ర‌కు పేరున్నా... జ‌నం మెచ్చే నేత‌గా మెలిగార‌న్న ముద్ర‌నూ ఆయ‌న సొంత చేసుకున్నారు. ఫ్యాక్ష‌న్ క‌క్ష‌ల‌తో అల్ల‌క‌ల్లోలంగా ఉన్న అనంత‌పురం జిల్లాలో త‌న‌దైన శైలి రాజ‌కీయం న‌డిపిన ప‌రిటాల‌... ఆ జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఫ్యాక్ష‌న్ నేత‌గానే చాలా మందికి తెలిసిన ప‌రిటాల రవీంద్ర‌కు పేద ప్ర‌జ‌లకు అండ‌గా నిలిచే నేత‌గానూ మంచి గుర్తింపే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయినా న‌క్స‌ల్స్ కు అనుకూలంగా ఉన్న ప‌రిటాల రవీంద్ర రాజ‌కీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చార‌న్న విష‌యం ఏ కొద్ది మందికో తెలుసు. చాలా మంది మాత్రం ప‌రిటాల తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత అనివార్యంగా ప‌రిటాల ర‌వీంద్ర రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేశార‌నే అనుకుంటారు. అయితే మ‌రి ప‌రిటాల ర‌వీంద్ర రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి కార‌ణం ఏమిటంటారా? ఆ మాట ఎవ‌రో చెబితే అంత‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌ని లేదు గానీ. టాలీవుడ్ టాప్ స్టార్‌, ప‌రిటాల సొంత జిల్లాకు చెందిన హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ నోట నుంచి ఆ కార‌ణం వినిపిస్తే ఆస‌క్తిక‌ర‌మే క‌దా. నిజ‌మే... ఇప్పుడు ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీలో ఎమ్మెల్యేగా, మొన్న‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దిగేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌... హిందూపురం నుంచే బ‌రిలోకి దిగి బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించారు.

ఆ త‌ర్వాత త‌న తండ్రి ఎన్టీఆర్‌తో పాటుగా... ఆయ‌న మ‌ర‌ణానంత‌రం చాలా ఏళ్ల త‌ర్వాత రంగంలోకి దిగిన త‌న‌ను కూడా ఆద‌రించిన హిందూపురం ప్ర‌జ‌ల స‌ర్వ‌తోముఖాభవృద్దికి బాల‌య్య త‌న‌దైన శైలిలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు తెర తీశారు. ఈ క్ర‌మంలో ఎప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లినా క‌నీసం మూడు రోజుల పాటు అక్క‌డ తిష్ట వేస్తున్న బాల‌య్య‌... హిందూపురంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అభివృద్ధి ప‌నుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో మొన్న హిందూపురంలో అడుగుపెట్టిన బాల‌య్య‌... నేడు కూడా అక్క‌డే ఉన్నారు. హిందూపురం పొరుగు ప‌ట్ట‌ణం పెనుగొండ‌కు వెళ్లిన ఆయ‌న అక్క‌డి మ‌డ‌క‌శిక కూడ‌లిలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా హిందూపురంతో పాటుగా మొత్తంగా రాయ‌ల‌సీమ‌కు త‌న తండ్రి ఎన్టీఆర్‌తో పాటుగా ప్రస్తుత పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చేస్తున్న మేళ్ల‌ను ప్ర‌స్తావించారు.

ప‌నిలో ప‌నిగా పెనుకొండను త‌న సొంతూరుగా చేసుకుని రాజ‌కీయం న‌డిపిన ప‌రిటాల రవీంద్ర‌ను కూడా బాల‌య్య గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య నోట నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వినిపించాయి. అస‌లు ప‌రిటాల ర‌వీంద్ర ఎందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారో?  తెలుసా అంటూ ప్ర‌సంగం మొద‌లెట్టిన బాల‌య్య‌... ఆ కార‌ణాన్ని కూడా ఆయ‌నే చెప్పేశారు. ఫ్యాక్ష‌న్‌తో రక్త‌సిక్తంగా మారిపోయిన అనంత‌పురం జిల్లాను ఆ ర‌క్క‌సి నుంచి కాపాడేందుకే ప‌రిటాల ర‌వీంద్ర రాజ‌కీయాల్లోకి వచ్చార‌ని బాల‌య్య చెప్పారు. అస‌లు ప‌రిటాల ర‌వీంద్ర‌ను రాజ‌కీయ బాట ప‌ట్టించింది... త‌న తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీనేన‌ని కూడా బాల‌య్య చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు