ఎందుకొచ్చిన యాత్ర జగను బాబూ?

ఎందుకొచ్చిన యాత్ర జగను బాబూ?

జగన్ ఖాతాలో మరో పనికి మాలిన పని పడింది. ఆయన ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీలను కలిసి వారి నిర్ణయాలను మార్చి సమైక్యానికి మద్దతు కూడగడతాను అంటూ చేపట్టిన పని  జగన్ ను అభాసుపాలు చేసింది. జగన్ శనివారం ఢిల్లీ వెల్లి సిపిఐ నేత సురవరంను, సిపిఎం నేత సీతారాం ఏచూరిని కలిసారు. కానీ వారు ఏమన్నారు, మంత్రుల బృందానికి ఇచ్చిన అభిప్రాయంలో మార్పు లేదు, దానికే కట్టుబడి ఉంటాం అన్నారు. మరి అలాంటపుడు జగన్ వెళ్లి సాధించేదేమిటి? ఇలా చేసిన పనినే చేయడం జనాల్లో పరువును పోగొట్టుకోవడం తరచు జరుగుతోంది.  అసలు జగన్  సమైక్యం అంటూ టర్నింగ్ ఇచ్చుకున్నప్పటి నుంచి ఏం చేసినట్లు?. తన తల్లి విజయమ్మ తో ఆమరణ దీక్ష చేయించాడు, రిజల్ట్ రాలేదు, తాను జైల్లో చేసాడు, అయినా రిజల్ట్ సేమ్ టు సేమ్.

సరే జైలులో ఉన్న జగన్ బయటకు వచ్చాడు, ఇక సీమాంద్రలో జనాలతో కలిసి తెలంగాణాలో టిఆర్ఎస్ లాగా సమైక్య ఉద్యమాన్ని ఇక ఊపేస్తాడు అనుకున్నారు. కాని జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ ఇప్పటి వరకు సీమాంద్ర నేలపైనే అడుగుపెట్టలేదు, ఇడుపుల పాయలో ఓసారి, ఇటీవల రాజమండ్రి,కాకినాడ స్వంత పనులపై తప్ప. పోని ఏం చేసాడు అంటే ఏమాత్రం పలితం ఇవ్వని ఆమరణ దీక్షనే మళ్లీ చేసాడు,  సమైక్య సభను హైదరాబాద్ లో పెట్టి కూడా ఏమైనా సాధించాడా, అంటే అదీ లేదు. రాష్ట్రం అంతటా తిరిగే అవకాశం లేదు అనుకున్నారు. ఇప్పడు ఆ అడ్డంకి తొలగింది, అయినా సమైక్య ఉద్యమ పర్యటన మాట ఎత్తడం లేదు.

పైగా రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం దేశమంతటా తిరిగి జాతీయ పార్టీ నేతలను కలిసి మద్దతు కూడ గడుతాను అన్నాడు. ఆ పని ఇప్పటికే తల్లి విజయమ్మ ఓ సారి చేసింది, ఆమెకు వారు తమ అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పేసారు. ఇప్పుడు జగన్ పోతే మనసు మార్చుకుంటారా, పైగా మంత్రుల బృందానికి పార్టీ తరఫున లిఖిత పూర్వకంగా అభిప్రాయం చెప్పాకా దానిని మార్చుకుంటారా అంటే వినలేదు, మారుస్తాను అంటూ బయలు దేరాడు. ఏమయింది. జగన్ శనివారం ఉదయం సిపిఐ నేతలను కలసి సమైక్యానికి మద్దతు అడిగారు. ఇప్పుడు మద్దతివ్వక పోతే రేపు దేశం ఇలా ఎన్నో ముక్కలు అవుతుంది, దేశం విఛ్చిన్నం అవుతుంది, దేశ సమగ్రత దెబ్బతింటుంది అని చెప్పారు. దీనికి స్పందించిన సిపిఐ నేతలు దానికి ససేమిరా అన్నారు. సమైక్యం కోరుకోవడంలో తప్పులేదు కాని దానివల్ల దేశం విఛ్చిన్నం అవుతుందని అనడంలో నిజం లేదన్నారు. దేశం ఎన్నో ముక్కలు కావడానికి ఆస్కారం ఉందనడం కరెక్టు కాదని చెప్పాడు. దేశం లో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి, అప్పుడు దేశం విఛ్చిన్నం కాలేదు, అలాంటిది ఏపిని విభజిస్తే విఛ్చిన్నం అవుతుందా అన్నారు. జగన్ కు విభజన ఇష్టం లేదు కాబట్టి ఆయన అలా అన్నారు అంతే తప్ప మరోటి లేదు అన్నారు.
 
ఆతర్వాత సిపిఎం ను కలిసాడు, ఇంకేముంది ముసిముసి నవ్వులు, ఎందుకంటే సిపిఎం ఎప్పటి నుంచో సమైక్యమే, జిఓఎం కు చెప్పింది కూడా అదే. సరే జగన్ కలవాల్సింది ఎవరిని మంత్రుల బృందానికి హాజరుకాని పార్టీలు, అవి రేపు పార్లమెంట్ లో ఓటింగ్ లో సమైక్యానికి మద్దతిస్తే పలితం ఉండే ఎస్పీ, బిఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి వాటిని, కాని ఆపని చేయకుండా తల్లి ఎవరిని కలిసి కాదని చెప్పించుకుని వచ్చిందో జగన్ కూడా వారినే కలవడం వల్ల ప్రయోజనం ఏమిటి, అసలు జగన్ కు సమైక్యంగా  ఉండాలని ఉందా, ఉంటే ఇక్కడ సమైక్యం కోరుకుంటున్న ప్రజలతో సీమాంద్ర నేలపై ఉద్యమం చేయకుండా ఇలా పలితం లేని పనులు చేయడం అంటే ఆయనకు సోనియాతో డీల్ కుదిరిందనే అన్న అభిప్రాయమే ప్రజల్లో నాటుకు పోయి అసలుకే ప్రమాదం వచ్చే అవకాశం మాత్రం ఉందన్నది వాస్తవం.