ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి అల్లుడు రేంజ్ తెలుసా?

ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి అల్లుడు రేంజ్ తెలుసా?

ప్ర‌ముఖ ఇన్ఫో దిగ్గ‌జం.. దేశంలో సుప‌రిచితుడైన ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి అల్లుడి రేంజ్ తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ప్రముఖ వ్యాపార‌వేత్త‌ల్లో నారాయ‌ణ‌మూర్తి దంప‌తులు క‌నిపిస్తారు. దేశంలో ప్ర‌ముఖ టెక్ కంపెనీల్లో ఒక‌టైన‌ప్ప‌టికీ.. సాదాసీదాగా ఉండ‌టంలో వారికి వారే సాటి.

తాజాగా నారాయ‌ణ‌మూర్తి అల్లుడు.. 37 ఏళ్ల రిషి సున‌క్ కు కీల‌క ప‌ద‌వి ల‌భించింది. బ్రిట‌న్ మంత్రివ‌ర్గంలో స్థానం ల‌భించింది. నారాయ‌ణ‌మూర్తి కుమార్తె భార‌త సంత‌తికి చెందిన రిషిని పెళ్లాడ‌టం తెలిసిందే.  తాజాగా బ్రిట‌న్ మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో కొత్త‌గా ప‌ద‌వులు అప్ప‌గించిన ఇద్ద‌రు భార‌త సంత‌తి ఎంపీల్లో రుషి ఒక‌రు కావ‌టం గ‌మ‌నార్హం.

అధికార పార్టీ త‌ర‌పున రిచ్ మండ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రుషికి తాజాగా హౌజింగ్‌.. క‌మ్యూనిటీస్‌.. లోకల్ గ‌వ‌ర్న‌మెంట్ వ్య‌వ‌హారాల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రుషితో పాటు భార‌త సంత‌తికి చెందిన ఫెర్నాండెజ్ ను మంత్రిగా నియ‌మించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే భార‌త సంత‌తికి చెందిన మ‌రో నేత అలోక్ వ‌ర్మ కూడా ఇప్ప‌టికే మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి అల్లుడు అన్నంత‌నే అయితే బిజినెస్ మ్యానో.. మ‌రేదో అనుకునే దానికి భిన్నంగా.. బ్రిట‌న్ మంత్రిగా అవ‌కాశం ల‌భించ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English