రెండోసారి గ‌జ‌ల్ బెయిల్ కు నో!

రెండోసారి గ‌జ‌ల్ బెయిల్ కు నో!

ఆల‌య‌వాణి రేడియో జాకీగా ప‌నిచేస్తున్న ఓ యువ‌తిపై లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడ‌న్న ఆరోప‌ణ‌పై ప్ర‌ముఖ గాయ‌కుడు గ‌జల్ శ్రీ‌నివాస్ పై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. గ‌జ‌ల్ ....కొంత‌మంది మ‌హిళ‌ల‌తో అభ్యంత‌ర‌క‌ర ప‌రిస్థితుల‌లో ఉన్న వీడియోల‌ను ఆ యువ‌తి...పోలీసులకు స‌మ‌ర్పించింది.

అయితే, త‌న క్లయింట్ కు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వకుండాననే పోలీసులు అరెస్టు చేశారని, అందువ‌ల్ల గ‌జ‌ల్ కు పోలీసు కస్టడీ అవసరం లేదని ఆయ‌న త‌రపు న్యాయ‌వాది ఈ నెల 3వ తేదీన కోర్టుకు తెలిపారు. అయితే, సెల‌బ్రిటీ హోదాలో ఉన్న గ‌జల్ శ్రీనివాస్ కు బెయిల్ మంజూరైతే సాక్షులను బెదిరించే అవ‌కాశ‌ముంద‌ని, పోలీసులు కౌంటర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు...గ‌జ‌ల్ కు చంచ‌ల్ గూడ జైలులో జ్యుడీషియ‌ల్ రిమాండ్ విధించింది.

తాజాగా, గ‌జ‌ల్ మ‌రోసారి బెయిల్ పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. అయితే, దీనికి బ‌దులుగా గ‌తంలో చెప్పిన కార‌ణాల‌నే చెబుతూ పోలీసులు మ‌రో కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే, ఆ కేసులో గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ కు ప‌నిమ‌నిషి పార్వ‌తి స‌హ‌క‌రించింద‌ని బాధితురాలు ఆరోపించింది. అక్క‌డ‌కు వ‌చ్చే యువ‌తులను...గ‌జ‌ల్ తో చ‌నువుగా ఉండాల‌ని ఆమె ఒత్తిడి చేసేద‌ని తెలిపింది. దీంతో, ఈ కేసులో ఏ2 నిందితురాలు పార్వతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాల్సి ఉందన్నారు. ఈ కేసులో బాధితులు పెరిగే అవకాశముందని, మ‌రింత‌మంది సాక్ష్యులను విచారించాల్సిన అవసర‌ముంద‌ని తెలిపారు.

గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులపై కొత్త కొత్త విషయాలు, ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలు మరిన్ని వీడియోలు పోలీసులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు పది నుంచి ఇరవై వరకు వీడియోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు నెలల నుంచి ఆమె స్టింగ్ ఆపరేషన్ చేసి వీడియోలు సేకరించింది.

ఆమె స్వయంగా వేధింపులకు గురైనవి కూడా ఉన్నాయని తెలుస్తోంది. తనతో పాటు పలువురు బాధితులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ప్రసారం చేయలేని స్థితిలో వీడియోలు ఉన్నాయని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు