ఫ్యామిలీ ఫంక్షన్లో గ్లామర్ రచ్చ ఏలనో?

ఫ్యామిలీ ఫంక్షన్లో గ్లామర్ రచ్చ ఏలనో?

జ్వాలా గుత్తా.. బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఈమెకు బోలెడంత గుర్తింపు ఉంది. సక్సెస్ ఫుల్ కెరియర్ కూడా ఈమె చేతిలో ఉంది. అయితే.. ఈమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉందనే విషయం అప్పుడపుడూ బయటపెడుతూ ఉంటుంది.

సిల్వర్ స్క్రీన్ పై వెలిగేందుకు అప్పట్లో కొన్ని ప్రయత్నాలను కూడా చేసింది జ్వాలా గుత్తా. ప్రభాస్ మూవీలో హీరోయిన్ గా నటించేందుకు బాగానే ట్రై చేసిందని అంటారు. టాలీవుడ్ జనాలు.. సెలబ్రిటీ పీపుల్ తో ఈమెకు మంచి స్నేహమే ఉంది. వీటినే బేస్ చేసుకుని గట్టిగానే ప్రయత్నించిందట. అయితే.. ఆ ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు కానీ.. నితిన్ తో ఓ సినిమాలో ఐటెం సాంగ్ వరకూ ఛాన్స్ దక్కించుకోగలిగింది. గుండె జారి గల్లంతయిందే మూవీలో ఓ ఐటెం పాటలో నర్తించింది జ్వాల.  డింగ్ డింగ్ అంటూ ఈ పాట బాగానే హిట్ అయింది కానీ.. ఈమెకు ఛాన్సులు రాలేదు. అలాగని గ్లామర్ యాంగిల్ వదలిపెట్టలేదు ఈ బ్యూటీ.

అలాగని ఈ యాంగిల్ వదిలేసిందని అనుకుంటే పొరపాటే. అనేక ఫంక్షన్స్ లో ఈమె అందాల చిందులు మామూలుగా ఉండవు. ఫ్యామిలీ ఫంక్షన్స్ కు కూడా రివీలింగ్ కాస్ట్యూమ్స్ వేసుకొచ్చేయడం ఈమె స్పెషాలిటీ. వీటిపై కొందరికి అభ్యంతరాలు ఉన్నా.. మై బాడీ మై రైట్ అంటే అప్పుడు ఎవరూ మాట్లాడే అవకాశం ఉండదు. అందుకే సినిమాల్లో వేసే అవకాశం రాకపోయినా.. ఇలా తన గ్లామర్ ముచ్చట తీర్చేసుకుంటూ ఉంటుంది జ్వాలా గుత్తా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు