ట్రిపుల్ తలాక్‌ను ఉపయోగించుకున్న చంద్రబాబు?

ట్రిపుల్ తలాక్‌ను ఉపయోగించుకున్న చంద్రబాబు?

పార్లమెంటులో ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరికి ఎలా ఉపయోగపడనుందో చెప్పలేం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మాత్రం తక్షణం ఉపయోగపడింది. రాజకీయ వర్గాల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు, ముస్లిం ఓట్ల లెక్కలతో పెద్దగా చిక్కుల్లేని ఏపీ రాజకీయాలకు ఏమిటి సంబంధం అని ఆశ్చర్యపోవద్దు.. ట్రిపుల్ తలాక్ బిల్లును అత్యంత సమర్థంగా వినియోగించుకుని చంద్రబాబు భారీ ప్రయోజనమే పొందారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా ఆయనకు మోదీ అపాయింటుమెంటు దొరకడం వెనుక ట్రిపుల్ తలాక్ బిల్లే ఉందని దిల్లీ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న బీజేపీ రాజ్యసభలో ఆ బిల్లు ప్రవేశపెట్టగానే విపక్షాలు అక్కడ తమ బలం చూపించాయి. ఇందులో వింతేమీ లేకపోయినా మిత్రపక్షం టీడీపీ కూడా అక్కడ బీజేపేకి ఎదురుతిరిగింది. కనీసం అపాయింటుమెంటు కూడా ఇవ్వకుండా ఏడిపిస్తున్న మోదీని తమ దారికి తేవడానికి ఇదే సమయమని చంద్రబాబు భావించి వ్యూహం అమలు చేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ట్రిపుల్ తలాక్ బిల్లుకు తలూపకుండా దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపించాలంటూ మెలిక పెట్టారు.

టీడీపీ అడ్డం తిరగడంతో బీజేపీకి విషయం అర్థమైందని.. దాంతోనే వెంటనే చంద్రబాబుకు పిలుపొచ్చిందని అంటున్నారు. దీంతో 17న మోదీని కలవనున్న చంద్రబాబు డిమాండ్ల చిట్టా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం విషయంలో మోదీతో స్పష్టమైన నిదుల హామీ చేయించాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు