కాబోయే అమెరికా అధ్య‌క్షురాలు..భార‌తీయ అమెరిక‌న్‌

కాబోయే అమెరికా అధ్య‌క్షురాలు..భార‌తీయ అమెరిక‌న్‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.... `ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ది ట్రంప్`  పుస్తకం అమెరికా రాజ‌కీయాల‌కు సంబంధించిన సంచ‌ల‌న విష‌యాల‌ను వెలుగులోకి తెలుస్తోంది. మైఖైల్ ఊల్ఫ్ రాసిన ఈ పుస్త‌కం తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా విధులు నిర్వహిస్తున్న నిక్కీ హేలీ 2020లో ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలని ఆసక్తిగా ఉన్నారని ఊల్ఫ్ వెల్ల‌డించారు. ఆమెను తన రాజకీయ వారసురాలని ట్రంప్ కూడా పరిగణిస్తున్నట్లు ఊల్ఫ్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న పుస్త‌కంలో రాశారు.

సౌత్ కరోలినా గవర్నర్‌గా పని చేసిన తొలి మహిళ నిక్కీ హేలీ భారత సంతతి మ‌హిళ‌. 2016 ఎన్నికల్లో ఫ్లోరిడా సెనెటర్ మార్కో రూబియో అభ్యర్థిత్వానికి తొలుత మద్దతు పలికారు. కానీ రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఆయనకు గట్టి మద్దతు దారుగా మారిపోయారు. ట్రంప్ కుమార్తె ఇవాంకతో స్నేహ పూర్వకంగా ఉండే నిక్కీ హేలీ.. ఆ కుటుంబంతో అనుబంధం పెంచుకున్నారు. దీని గురించే ఊల్ఫ్ వివ‌రించారు.ట్రంప్ కంటే నిక్కీ హేలీ మెరుగైన అభ్యర్థిగా ఉంటారని దేశాధ్యక్షుడి సన్నిహితుల మధ్య చర్చ జరిగిందని ఊల్ఫ్ త‌న పుస్త‌కంలో ఆనాటి సంగ‌తుల‌ను వెల్ల‌డించారు.  నిక్కీ హేలీని తొలుత విదేశాంగశాఖ మంత్రిగా నియమించాలని ట్రంప్ భావించినా.. చివరకు ఐరాసలో అమెరికా రాయబారిగా నియమించారని ఊల్ఫ్ వివరించారు. డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు స్టీవ్ బాన్నోన్ వ్యతిరేకత వల్లే నిక్కీ హేలీని విదేశాంగశాఖ మంత్రిగా నియమించలేదని తెలిపారు.

ఇదిలాఉంగా...ఊల్ఫ్ పుస్త‌కం, త‌న‌పై వ‌స్తున్న ఇత‌ర విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దీటుగా జవాబిచ్చారు.తన మానసిక ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నార‌ని అస‌హం వ్య‌క్తం చేస్తూ... ఈ వదంతులు తననేమీ చేయజాలవని, తనెంతో దృఢచిత్తం కలవాడినని పేర్కొంటూ వరుసగా పలు ట్వీట్‌లు చేశారు. తాను మహా మేధావిని కాకుంటే వ్యాపారవేత్తగా, టీవీ స్టార్‌గా, తొలి ప్రయత్నంలోనే అధ్యక్షునిగా ఎన్నికల కావటంలో వరుస విజయాలు ఎలా సాధించగలనంటూ తనకు తానే కితాబునిచ్చుకున్నారు ట్రంప్‌

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు