బాలయ్యనూ వదలని కత్తి

బాలయ్యనూ వదలని కత్తి

మహేష్ కత్తి.. ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లో నానుతున్న పేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో ఆయన కయ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అది రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతూ.. ఈ గొడవ ఏ పరిణామాలకు దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి ఫుల్ స్టాప్ పడాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

ఐతే పవన్ మీద విమర్శల దాడిని మరింతగా పెంచుతున్న కత్తి.. ఇప్పుడు మరో స్టార్ హీరో బాలయ్యను కూడా టార్గెట్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అభిమానుల్ని కొట్టడం అలవాటుగా మార్చుకున్న బాలయ్యకు హాస్పిటల్ కు తీసుకెళ్లి సైక్రియాట్రిస్టుతో కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరముందని చెప్పడం ద్వారా పరోక్షంగా బాలయ్యను పిచ్చాసుపత్రికి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డాడు కత్తి.

మనుషుల్ని.. ముఖ్యంగా అభిమానుల్ని కొట్టడం అనైతికమని.. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే అయి ఉండి కూడా బాలయ్య జనాల్ని కొట్టడం సభ్యత కాదని.. ఆ హక్కు ఆయనకు లేదని అన్నాడు కత్తి. బాలయ్యకు మెడికల్ కౌన్సెలింగ్ అవసరమని.. వీలైనంత త్వరగా బాలయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి.. సైక్రియాట్రిస్టుతో చికిత్స చేయించాల్సిన అవసరముందని కత్తి అభిప్రాయపడ్డాడు. బాలయ్య తాను ఓ రాజు అయినట్లు.. ఇంకా రాజులు రాజవంశాలు ఉన్నట్లు.. తమ వంశం మాత్రమే గొప్పదైనట్లు ఫీలవుతున్నాడని కత్తి విమర్శించాడు. ఐతే కత్తి అభిప్రాయాలన్నీ కరెక్టే అయినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు అవసరమా అన్నది ప్రశ్న.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు