ప్ర‌దీప్ ఎపిసోడ్‌పై ట్రాఫిక్ పోలీసుల రిప్లై పంచ్‌

ప్ర‌దీప్ ఎపిసోడ్‌పై ట్రాఫిక్ పోలీసుల రిప్లై పంచ్‌

ప్ర‌దీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ య‌వ్వారంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికేసి.. పోలీసుల ఎదుట హాజ‌రు కావాల్సిన అత‌గాడు హాజరుకాని ప‌రిస్థితి. అత‌గాడి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్న‌ట్లుగా మీడియాలో వార్త‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. ఇలాంటి వేళ‌.. వీడియో సందేశాన్ని ఆన్ లైన్లో పోస్ట్ చేశారు.

త‌న‌కు ఇచ్చిన స‌ల‌హా ప్ర‌కారం.. తాను చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని.. త‌న‌కు ఇచ్చిన గ‌డువు లోపు పోలీసుల ఎదుట హాజ‌ర‌వుతాన‌ని.. ప్ర‌స్తుతం తాను షూటింగ్ ల బిజీలో ఉన్న‌ట్లుగా చెప్పుకొన్నారు. ఇదిలా ఉంటే.. టీవీ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచినేని య‌వ్వారాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో కొంద‌రు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.
నీతులు చెప్పే సెల‌బ్రిటీలు.. కెమేరా ముందేన‌ని.. త‌మ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి ఏం చేయాలో అది చేస్తార‌న్న  విష‌యం మ‌రోసారి రుజువైందంటున్న వారు లేక‌పోలేదు. త‌ప్పు చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు క‌దా.. వ‌దిలేయొచ్చు క‌దా అంటూ బుజ్జిగా పోస్టులు పెడుతున్న వారు కూడా లేక‌పోలేదు.

తాజాగా ఆ త‌ర‌హా పోస్టు ఒక‌టి హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్ బుక్ పేజీలో ఒక‌రు పోస్ట్ చేశారు. భారీగా మ‌ద్యం తాగి డ్రైవ్ చేసి పోలీసుల త‌నిఖీల్లో అడ్డంగా బుక్ అయిన ప్ర‌ద‌ప్ ప‌ట్ల జాలిని ప్ర‌ద‌ర్శిస్తూ.. హ‌నీ భ‌వాని పేరుతో పోస్ట్ చేస్తూ.. సార్.. మా ప్ర‌దీప్ నుఓగ్గేయ్యండి. పాపం చిన్న‌పిల్లాడు.. తెలియ‌క చేశాడ‌ని పేర్కొన్నారు. దీనికి హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు రియార్ట్ అవుతూ.. చిన్న పిల్లాడైతే పాలు తాగాలి కానీ మందు తాగి న‌డ‌ప‌వ‌టం క‌రెక్ట్ కాదు క‌దా! సెల‌బ్రిటీలు అంద‌రికి ఆద‌ర్శంగా ఉండాలంటూ పోస్ట్ చేశారు. ఈ రెండు పోస్టులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే పోలీసుల ఎదుట కౌన్సెలింగ్‌కు హాజ‌ర‌య్యేందుకు మ‌రికాస్త గ‌డువు ఇవ్వాల్సిందిగా ప్ర‌దీప్ కుటుంబ స‌భ్యులు పోలీసుల్ని కోరిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. గ‌డువు పొడిగించే విష‌యంలో పోలీసులు ఎలాంటి హామీ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. అయితే.. తామిచ్చిన గ‌డువు లోపు ప్ర‌దీప్ కానీ కౌన్సెలింగ్‌కు హాజ‌రు కాని ప‌క్షంలో ఛార్జిషీట్ దాఖ‌లు చేయాల‌ని పోలీసులు  భావిస్తున్నారు. మ‌రి.. ఎడ‌తెగ‌ని షూటింగ్ బిజీలో ఉన్న ప్ర‌దీప్ పోలీసుల ఎదుట‌కు వ‌స్తాడంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు