ప్రకాశ రాజ్కు కలిసి రాని కాలమ్

ప్రకాశ రాజ్కు కలిసి రాని కాలమ్

కర్ణాటకలోన ప్రముఖ పత్రికల్లో ఒకటైన ఉదయవాణి నటుడు ప్రకాశ్ రాజ్‌కి షాకిచ్చింది. చాలాకాలంగా ఆ పత్రికలో వారంవారం కాలమ రాస్తున్న ఆయన్ను ఇక చాలని చెప్పేసింది. దీంతో ప్రకాశ్ రాజ్ ఆ పత్రికపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట.

కన్నడ పత్రిక ఉదయవాణిలో ప్రకాశ్ రాజ్ ప్ర‌తి శ‌నివారం ”ఇరుదెల్లువ బిట్టు” అనే ఒక కాలమ్ రాసేవారు. అందులో ప్రధానంగా బీజేపీని, హిందూత్వను తిట్టిపోయడమే ఆయన పని. అయితే.. సదరు పత్రిక ఇప్పుడా కాలమ్ ముగించేసింది. ఇక మీ రాతలు మాకు అవసరం లేదని ప్రకాశ్ రాజ్ కు చెప్పేసింది.

దీంతో ప్రకాశ్ రాజ్ తెగ ఫీలయ్యారట. తాను ఎంతో ఇష్ట‌ప‌డి రాస్తున్న కాల‌మ్ ఆగిపోవ‌డంతో ప్ర‌కాశ్‌రాజ్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. అత్య‌ధిక స‌ర్కులేష‌న్ క‌లిగిన ప‌త్రిక‌లో త‌న కాల‌మ్ రాకుండా కొన్ని అదృశ్య శ‌క్తులు అడ్డుకున్నాయ‌ని ఆయన ఆరోపించారు. హిందుత్వ రాజ‌కీయాల‌పై తాను చేస్తున్న ఘాటైన విమ‌ర్శ‌లే దీనికి కారణమని అన్నారు. రాజ‌కీయ క‌క్ష సాధింప‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
    
అయితే... ఉద‌య‌వాణికి కొత్త ఎడిట‌ర్ గా శివ సుబ్ర‌హ్మ‌ణ్యం బాధ్య‌త‌లు చేప‌ట్టాకే ప్రకాశ్ రాజ్ ను పక్కన పెట్టారు. ఎడిటర్ సుబ్రహ్మణ్యం ఇప్పుడు ప్ర‌కాశ్‌రాజ్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. కొత్త ర‌చ‌యిత‌ల కోసం తాము ఎల్ల‌ప్పుడూ వెతుకుతుంటామ‌ని, వేరే వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం కోసమే ప్ర‌కాశ్‌రాజ్‌ను త‌ప్పించామ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌కాశ్‌రాజ్‌ను త‌ప్పించ‌డం చాలా సాధార‌ణ విష‌య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఇందులో ఎటువంటి రాజ‌కీయ ఒత్తిడి లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి న్యూస్ పేప‌ర్‌లోను ఇలా జ‌రుగుతుంటుంద‌ని శివ సుబ్ర‌హ్మ‌ణ్యం తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు