గజల్.. ఓ కామెంటేస్కోండి నాయనా

గజల్.. ఓ కామెంటేస్కోండి నాయనా

గజల్ శ్రీనివాస్.. కొన్ని రోజుల వరకూ ఈయన పెద్ద సెలబ్రిటీనే. చాలామందికి ఆదర్శ పురుషుడే. కానీ సడెన్ గా ఒక్క వ్యవహారంతో సీన్ మారిపోయింది. గజల్ శ్రీనివాస్ లో గజల్ ను గలీజ్ చేసేశారు. వీడియో ద్వారా ఈయన భాగోతాన్ని ఓ మహిళ బైట పెట్టడమే ఇందుకు కారణం అని చెప్పాల్సిన పని లేదు. అవగాహనా రాహిత్యంతో ఈయనను సపోర్ట్ చేసి.. తర్వాత తప్పొప్పుకున్నారు ఓ పొలిటికల్ లీడర్.

అంతవరకూ ఓకే కానీ.. ఇప్పుడు సడెన్ గా చాలామంది గజల్ శ్రీనివాస్ గురించి చెప్పేస్తున్నారు. ఆయన అట్టాంటోడే అని చెప్పే బాపతు జనాల కౌంట్ బాగా పెరుగుతోంది. ఇంతకు ముందే ఈయన వ్యవహారం తెలుసనే వారు కూడా ఉంటున్నారు. వీళ్లందరూ నిజంగా నిజమే చెబుతున్నారా.. లేక పబ్లిసిటీ కోసం ఇలా ఓ డైలాగ్ పారేస్తున్నారా అనే డౌట్స్ సహజమే. అయితే.. వీరంతా మరి ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు ఏమైపోయారు.. అప్పుడెందుకు ఎవరూ నోరు మెదపలేదు అనే డౌట్ వచ్చినా.. బైటకు అడక్కూడదేమో అనిపించక మానదు. ఇంతకీ ఇదంతా గజల్ శ్రీనివాస్ ను సపోర్ట్ చేయడం అనుకోకండే..

అసలు విషయం ఏంటంటే.. ఏదన్నా వివాదం బయలుదేరగానే అసలు అందులో నిజానిజాలు ఎంత అనే సంగతి కంటే.. ఏదో ఒకటి మాట్లాడేసి మీడియాలో కనిపించాలనే అత్యుత్సాహవంతులే ఎక్కువగా ఉంటారు. మీడియా కూడా ఇలా హాట్ టాపిక్స్ పై రియాక్ట్ అయ్యేవారి బైట్స్ ను మళ్లీ మళ్లీ టెలికాస్ట్ చేసి.. రేటింగ్ ల కోసం తాపత్రయపడుతుంది. దీంతో అసలు వ్యవహారం కంటే.. ఇలాంటి వాటికి ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు