ప్రదీప్ ని వేధిస్తున్న జబర్దస్త్ టెన్షన్

ప్రదీప్ ని వేధిస్తున్న జబర్దస్త్ టెన్షన్

ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న వారిని చాలానే టెన్షన్స్ పట్టుకుని వేధిస్తున్నాయి. నచ్చినట్లుగా చేసేందుకు ఉండేందుకు.. ఇప్పుడువారికి చాలానే ఇబ్బందులున్నాయి. మీడియా.. సోషల్ మీడియాల కంటబడితే..వారికి ఉప్పందితే.. ఇక రచ్చరచ్చ అయిపోతోంది వ్యవహారం. వీటికి తోడు ఇప్పుడు కామెడీ యాక్టర్స్ కూడా మరీ చురుగ్గా మారిపోయారు.

తనే టీవీ యాంకర్ అయినా.. టీవీ ఆర్టిస్టులను తలచుకుని టెన్షన్ పడుతున్నాడట యాంకర్ ప్రదీప్. న్యూఇయర్ సంబరాల్లో భాగంగా మందుకొట్టి డ్రైవ్ చేస్తూ అడ్డంగా దొరికేసిన ప్రదీప్.. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రదీప్ జబర్దస్త్ టీవీ షోకి భయపడుతున్నాడట. ఈ కార్యక్రమంలో లైవ్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని.. డైరెక్టుగా ఆయా వ్యక్తుల పేర్లతోనే కామెడీ చేసి పారేస్తున్నారు. మందు కొట్టొద్దూ అని చెప్పడం.. చివర్లోమందు కొట్టి పడిపోవడం.. ఆ ప్రదీప్ లాగా.. అంటూ సెటైర్ వేస్తారేమోనని ఫీలవుతున్నాడట ప్రదీప్. అంతే కాదు.. ఇదే థీమ్ తో ఓ స్కిట్ చేసేసినా మనమేమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

కాదేదీ కామెడీకి అనర్హం అన్నట్లుగా జబర్దస్త్ వాలకం ఉంటే.. దీన్ని తలచుకుని తలచుకుని మరీ టెన్షన్ పడాల్సిన పరిస్థితి పలువురికి వస్తోంది. కానీ ఈ థీమ్ తో స్కిట్ చేసినా.. కామెడీ చేసినా.. బాగానే పేలడం ఖాయం. ప్రదీప్ ని వెతుకుతున్నా అంటూ ఇప్పటికే బిత్తిరి సత్తి ఓ కౌంటర్ వేసేసిన సంగతి మీకు తెలుసుగా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English