1993లో రజినీ ఏమన్నాడంటే...

1993లో రజినీ ఏమన్నాడంటే...

రజినీకాంత్- రాజకీయాలు ఇదేమీ కొత్త విషయం. గత మూడు దశాబ్దాలుగా రజినీ పొలిటికల్ ఎంట్రీపై మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతీసారి ఎలక్షన్స్ వచ్చినపుడల్లా ఈ మాటలు మరితంగా పెరుగుతుంటాయి. చివరకు ఆయన పార్టీ లేదు.. ఏమీ లేదు అని అభిమానుల ఉత్సాహం చల్లబరిచేస్తూ ఉంటారు.

ఇప్పుడంటే రాజకీయ పార్టీ అనౌన్స్ చేస్తున్నట్లు అధికారికంగానే చెప్పారు రజినీకాంత్. కానీ ఓ పాతికేళ్ల వెనుకకు వెళితే.. రాజకీయాలపై రజినీ ఏమన్నారో తెలుస్తుంది. 1993లో ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజ్ పైకి ఎక్కిన రజినీకాంత్.. ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అప్పట్లోనే పాలిటిక్స్ పై చాలా కబుర్లు చెప్పారాయన. అప్పటి ఇంటర్వ్యూకు సంబంధించిన క్లిప్పింగ్స్ ను ఇప్పుడు మళ్లీ షేర్ చేసిన ఫిలింఫేర్.. హ్యాపీ మెమరీస్ అంటోంది. "ఇప్పటికిప్పుడు నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేమీ లేదు. కానీ ఒకవేళ నా డెస్టినీ అలా ఉంటే ఎవరు మాత్రం ఆపగలరు"అన్నారు రజినీ.

రజినీని జయలలిత ఫోర్స్ చేశారనే ప్రశ్నకు స్పందిస్తూ.. "ఇప్పటివరకూ ఎవరూ నన్ను అప్రోచ్ కాలేదు. వారికి నాకు ఇంట్రెస్ట్ లేదనే విషయం తెలుసు" అన్న రజినీ.. ముఖ్యమంత్రి అయితే అనే ప్రశ్నకు కూడా రియాక్ట్ అయ్యారు. "ముందు నన్ను సీఎం కానివ్వండి. ఎందుకు ఊహించుకోవడం.. నేను ప్రాక్టికల్ మనిషిని. నేను కలల్లో బతకను. ఇవాల్టి కోసం.. ఇప్పటి క్షణం కోసం బతుకుతాను" అని 1993లో చెప్పాడు రజినీకాంత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు