కేసును కాంప్లికేట్ చేసుకుంటున్న ప్రదీప్

కేసును కాంప్లికేట్ చేసుకుంటున్న ప్రదీప్

న్యూఇయర్ పార్టీ సంబరాల్లో తప్పతాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికేశాడు స్టార్ యాంకర్ ప్రదీప్. కంట్రోల్ లోనే ఉన్నాడని సన్నిహితులు చెప్పచ్చు కానీ.. 178 పాయింట్లు చూపించిందంటే.. కచ్చితంగా అది మోతాదుకు మించిన తాగుడే. పైగా ప్రదీప్ నడుపుతున్న కారుకు విండోస్ కు బ్లాక్ స్టిక్కరింగ్ ఉండడంతో.. అదో కేసుగా పరిణమించవచ్చు.

వీటన్నిటి కంటే పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతుండడం ప్రదీప్ ను మరింతగా ఇబ్బంది పెట్టే విషయం. అయితే.. తను ఇబ్బంది పడ్డం సంగతేమో కానీ.. ఈ విషయానికి బ్రేక్ వేసేలా చర్యలు తీసుకోకుండా.. మరిన్ని వార్తలు రావడానికి కారణం అవుతున్నాడు ప్రదీప్. ఇల్లు.. ఆఫీస్ లో పోలీసులకు కనిపించకపోవడం.. ఫోన్ స్విచాఫ్ చేసి పెట్టుకోవడం వంటివి సీరియస్ మ్యాటర్స్. ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు.. ఆ సమయంలో ప్రదీప్ కారులో ఉన్న అమ్మాయి గురించి ఆరాలు పెరిగిపోతున్నాయి. ఆమె ఓ పొలిటీషియన్ కూతురు అంటూ ప్రచారం జరుగుతోంది. అసలు ఆ అమ్మాయి ఆ సమయంలో ప్రదీప్ కార్లో ఎందుకు ఉందని చర్చించేసుకుంటున్నారు నెటిజన్లు.

సైలెంట్ గా సైడ్ అయిపోవాల్సిన మ్యాటర్ ను.. అనవసరంగా ప్రదీప్ సీరియస్ మ్యాటర్ చేసుకోవడమే కాకుండా.. ఆ అమ్మాయిని కూడా హాట్ టాపిక్ చేసేస్తున్నాడు అంటున్నారు నెటిజన్స్. తను తాగి డ్రైవ్ చేసి కేసులో ఇరుక్కుని.. ఆ అమ్మాయిని సోషల్ మీడియాకి టార్గెట్ గా చేశాడంటూ.. ఆ అమ్మాయి తాలూకు స్నేహితులు కూడా కామెంట్లు చేస్తున్నరాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు