త‌లాక్‌పై మోడీ కాస్త వెన‌క్కి త‌గ్గేలా చేసిన కాంగ్రెస్‌

త‌లాక్‌పై మోడీ కాస్త వెన‌క్కి త‌గ్గేలా చేసిన కాంగ్రెస్‌

పెద్ద విజ‌యం కోసం ఒక అడుగు వెన‌క్కి వేయ‌టం త‌ప్పేం కాదంటారు. ఇప్పుడు మోడీ స‌ర్కారు అదే ప‌ని చేసిందా? అంటే అవునంటున్నారు. క‌మ‌ల‌నాథుల మాట ఇలా ఉంటే.. ఎంత‌కూ త‌గ్గ‌ని మోడీ స‌ర్కారు వెన‌క‌డుగు వేసేలా చేయ‌టం.. ప‌ట్టిన పంతాన్ని నెగ్గించుకోవ‌టం చిన్న విష‌యం కాద‌ని కాంగ్రెస్ నేత‌లు వాదిస్తున్నారు. ట్రిపుల్ త‌లాక్ బిల్లు విష‌యంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంద‌ని చెబుతున్నారు.

లోక్ స‌భ‌లో పాస్ అయిన బిల్లు రాజ్య‌స‌భ చ‌ర్చ సంద‌ర్భంగా ఈ బిల్లును పార్ల‌మెంటు సెల‌క్ట్ క‌మిటీకి పంపాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. దీనికి బీజేపీ స‌సేమిరా అంటోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఒక‌సారి బిల్లును సెల‌క్ట్ క‌మిటీకి పంపిన త‌ర్వాత‌.. అక్క‌డ చేసే సూచ‌న‌లు.. ప్ర‌తిపాద‌న‌ల్ని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. రాజ్య‌స‌భ‌లో బ‌లం లేని బీజేపీ.. కీల‌క‌ త‌క్ష‌ణ ట్రిపుల్ త‌లాక్ బిల్లు  ఆమోదించుకునే ప‌నిలో భాగంగా ప్ర‌ధాన ప్ర‌తిపక్షంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న కాంగ్రెస్ పంతానికి త‌లొగ్గిన‌ట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ కోరిన‌ట్లుగా బిల్లును సెల‌క్ట్ క‌మిటీకి పంప‌టం ద్వారా.. వ‌చ్చే పార్ల‌మెంటు సెష‌న్స్ లో బిల్లు పాస‌య్యే అవ‌కాశం ఉంది.

కాంగ్రెస్ పంతాన్ని క‌మ‌ల‌నాథులు కాద‌నే ప‌క్షంలో బిల్లు రాజ్య‌స‌భ‌లో పాస‌య్యే ప‌రిస్థితి ఉండ‌దు. అదే జ‌రిగితే మోడీ స‌ర్కారు భారీ వైఫ‌ల్యంగా మారుతుంది. అందుకే.. సెల‌క్ట్ క‌మిటీకి పంపేందుకు మోడీ స‌ర్కారు ఓకే అనేందుకు సిద్ధంగా ఉంద‌ని చెబుతున్నారు. ఏమైనా.. మోడీ విష‌యంలో తాము ప‌ట్టిన పంతాన్ని విడ‌వ‌కుండా వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్ ఎట్ట‌కేల‌కు.. ట్రిపుల్ త‌లాక్ బిల్లు విష‌యంలో విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌న్న మాటను చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు