ఎక్క‌డైనా త‌గ్గు ప‌వ‌న్ కేసీఆర్ వ‌ద్ద కాదు

ఎక్క‌డైనా త‌గ్గు ప‌వ‌న్ కేసీఆర్ వ‌ద్ద కాదు

`ప‌వ‌న్ ఎక్క‌డ త‌గ్గాలో కూడా తెలుసంటున్నావు. అలాంటి నువ్వు తెలంగాణ‌ కేసీఆర్ మాయ‌లో ప‌డ్డావు. ఆయ‌న అవినీతికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారుతున్నావు. కేసీఆర్...బర్రెలు... గొర్రెలు...సిల్క్ స్మిత చీరలు పంచుతున్నారు. మ‌రోవైపు మ‌హిళ‌లు...విద్యార్థులు..గిరిజ‌నులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. పవన్ వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు చెప్పాలి` అని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప‌వ‌న్ క‌లిసిన నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. 24గంటల విద్యుత్ ను 56లక్షల మంది రైతులు కోరుకోలేదు...ఉదయం పూట 9గంటలు ఇస్తే చాలు అని రైతులు కోరుకుంటున్నారు కానీ కేసీఆర్ ప్ర‌చారం చేసుకుంటుంటే...దానికి ప‌వ‌న్ వంత పాడ‌టం స‌రికాద‌ని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు  విద్యుత్ పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడుతోంది...అని రేవంత్ ఆరోపించారు.

తెలంగాణ ఏర్ప‌డితే విద్యుత్ అంధ‌కారం అని ఆ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ స‌మ‌యంలో చెప్పింది వాస్తవమ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. `తెలంగాణ క‌ష్టాల‌ను కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ వినియోగ ప్రాతిపాదికన విద్యుత్‌ను విభజించారు. ఆ స‌మ‌యంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్లు, భూపాలపల్లి 600, మహబూబ్ నగర్ 240 మెగావాట్ ప్రాజెక్ట్ లు నాడు కాంగ్రెస్ హయాంలో ప్రారంభించారు. కాంగ్రెస్ నాడు ప్రారంభించిన విద్యుత్ వల్లనే నేడు మిగులు విద్యుత్. ఉదయ్ ఫథకం ద్వారా కూడా కేంద్రం  రాష్ట్రానికి విద్యుత్ ఇస్తుంది` అని రేవంత్ రెడ్డి అన్నారు.

విద్యుత్ పంపిణీ విష‌యంలో పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని రేవంత్ రెడ్డి అన్నారు. దివాళా తీసిన విద్యుత్ కంపెనీల నుండి కొనుగోలు చేస్తున్నారు. `నిజాలు తెలుసుకోవాలంటే ,,విద్యుత్ జేఏసీ రాసిన పుస్తకం చదువు పవన్. పవన్‌కు రఘు రాసిన పుస్తకాన్ని పంపుతాను. విద్యుత్ వెనక దోపిడీని పవన్ గుర్తించాలి. కేసీఆర్..దోపిడీకి పవన్ కళ్యాణ్ ను బ్రాఅండ్ అంబాసిడర్ గా చేసేలా ఉన్నారు`అని అనుమానం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలు, గిరిజనులు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విష‌యం పవన్ తెలుసుకోవాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు.నలబై నెలల్లో నాలుగు సార్లు సచివాలయం రాని కేసీఆర్ పాల‌నలో ఏం అద్భుతమ‌ని పవన్ కొనియాడారు? తెలంగాణాలో పరిస్థితి పై పవన్ కు అవగాహన లేనట్టుంది. పవన్ వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు చెప్పాలి. దోచుకుంటున్న కెసిఆర్ ను పవన్ సమర్తించడమా? అమరవీరుల బలిదానాలను అవమానించిన కేసీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఎలా సమర్థిస్తారు? పవన కళ్యాణ్...ఒక వైపు కాదు రెండో వైపు చేస్తే అసలు తెలంగాణ కనిపిస్తుంది. బంగారు తెలంగాణాలో బంగారు లేదు...తెలంగాణ బొందల గడ్డగా మారుతోంది  పవన్ పై మాకు విస్వాసం ఉంది ,,లాలూచీకి పవన్ లొంగిపోతారని నేను అనుకోను` అని రేవంత్ రెడ్డి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు