ఐఫోన్ సారీ చెప్ప‌ట‌మే కాదు.. ఆఫ‌ర్ ఇచ్చేసింది!

ఐఫోన్ సారీ చెప్ప‌ట‌మే కాదు.. ఆఫ‌ర్ ఇచ్చేసింది!

వ్యాపారంలో చిత్ర‌మైన ప‌ద్ద‌తుల్ని అనుస‌రించ‌టం ప్ర‌ఖ్యాత ఆపిల్ కంపెనీకి మాత్ర‌మే చెల్లుతుంద‌ని చెప్పాలి. యూజ‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ విష‌యంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకునే ఈ కంపెనీ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు భారీగా ఉన్న‌ప్ప‌టికీ.. అవి అందించే సేవ‌ల‌తో పోలిస్తే త‌క్కువేన‌ని వాటి వినియోగ‌దారులు చెబుతుంటారు.

ఏమైనా సామాన్యుల సంగ‌తి త‌ర్వాత‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు సైతం ఆపిల్ ఉత్పత్తుల్ని కొనే ప‌రిస్థితుల్లో ఉండ‌రు. ఒక‌వేళ ఆపిల్ మీద ఉన్న ఆస‌క్తితో కొనుగోలు చేసిన వారికి తాజాగా ఆ కంపెనీ ఇస్తున్న షాకుల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఏ కంపెనీ అయినా.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మోడ‌ళ్ల‌ను మార్కెట్లోకి తీసుకురావ‌టం మామూలే. అయితే.. కొత్త‌వి తీసుకొచ్చే క్ర‌మంలో పాత‌వాటికి సేవ‌లు అందించే విష‌యంలో త‌క్కువ చేస్తే వ‌చ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం ఐఫోన్ X మార్కెట్లోకి తెచ్చిన కంపెనీ.. త‌న పాత మోడ‌ళ్లు ఐఫోన్ 4.. ఐఫోన్ 5 లాంటి వాటికి ఆప్ డేట్ చేసే విష‌యంలో స‌రైన సేవ‌లు అందించ‌టం లేద‌న్న ఫిర్యాదులు ఉన్నాయి.

హైఎండ్ మోడ‌ళ్ల మీద కంపెనీ పెడుతున్న దృష్టి.. రోజులు గడుస్తున్న కొద్దీ పాత మోడ‌ళ్ల‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో పాత వెర్ష‌న్ల ఐఫోన్ల వేగం త‌గ్గింది. దీనిపై యూజ‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రైతే కంపెనీ తీరు స‌రికాదంటూ కోర్టుల్ని ఆశ్ర‌యిస్తున్నారు. ఇలాంటి వేళ ఆపిల్ కంప‌నీ స్పందించింది. త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు సారీ చెప్ప‌టంతో పాటు.. త‌మ త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్న హామీని ఇచ్చేసింది.

పాత వెర్ష‌న్ ఐఫోన్ లు ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా ష‌ట్ డౌన్ కాకుండా ఉండేందుకు వాటి ప‌ని తీరు వేగాన్ని కావాల‌నే త‌గ్గించినట్లుగా ఒప్పుకుంది. దీనిపై విమ‌ర్శ‌లు తీవ్ర‌త‌రం కావ‌టంతో మొద‌ట సారీ చెప్పిన కంపెనీ.. ఫోన్ల‌లో కాల‌ప‌రిమితి తీరిన బ్యాట‌రీ రేట్ల‌ను భారీగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. హైఎండ్ మోడ‌ళ్ల‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్లు బ్యాట‌రీ వారెంటీ తీరిన వాటిని మార్చుకునేందుకు భారీగా ఛార్జ్ చేస్తోంది. ఒక్కో బ్యాట‌రీకి త‌క్కువ‌లో త‌క్కువ రూ.6500 వ‌ర‌కు ఛార్జ్ చేస్తోంది. దీన్ని.. ప్ర‌స్తుతం త‌గ్గించి రూ.2వేల వ‌ర‌కూ త‌గ్గించింది. అయితే.. దీనికి ప‌న్నులు అద‌న‌మ‌ని పేర్కొంది. బ్యాట‌రీతో పాటు దాని సాఫ్ట్ వేర్ ను కూడా అప్డేట్ చేసి ఇవ్వ‌నున్ట‌న్లు పేర్కొంది. ఇప్ప‌టికైనా తాను చేసిన త‌ప్పుల్ని ఒప్పుకొని.. దిద్దుబాటు చ‌ర్య‌ల్లోకి దిగ‌టం ఓకే అయినా.. ఈ ప‌ని ముందే చేసి ఉంటే బాగుండేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు