ప‌వ‌న్ అంతుచిక్క‌ని వ్య‌క్తి..హ‌రీశ్ హార్డ్ వ‌ర్క‌ర్‌ అంటున్న కేటీఆర్‌

ప‌వ‌న్ అంతుచిక్క‌ని వ్య‌క్తి..హ‌రీశ్ హార్డ్ వ‌ర్క‌ర్‌ అంటున్న కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మ‌రోమారు కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టారు. మంత్రి అంటే హంగూ అర్బాటం అనే దానికి భిన్నంగా క్యాజువ‌ల్‌గా ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయిపోయే కేటీఆర్ తాజాగా దీనికి ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. గురువారంనాడు ట్విట్టర్‌లో ప్రజలతో లైవ్‌చాట్ చేశారు.  దాదాపు రెండు గంటలకుపైగా రాజకీయ, వ్యక్తిగత, వృత్తిగత, పరిపాలనాపరమైన అభిప్రాయాలు, ప్రశ్నలు, సందేహాలు స్వీకరిస్తూ తగు రీతిలో, తనదైనశైలిలో చమత్కారంగా, సందర్భోచితంగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై మంత్రి కేటీఆర్ త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును టాస్క్‌మాస్టర్ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. మంత్రి హరీశ్‌రావు మొండిపట్టుదల కలిగిన, కష్టపడి పనిచేసే నాయకుడని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా ఓ నెటిజ‌న్ ఆస‌క్తిక‌ర‌మైన ప్రశ్న సంధించారు. పవన్‌కల్యాణ్ ఒక ఎనిగ్మా (అంతుపట్టని) అని వివరించారు. ప్రజలే పవన్‌కల్యాణ్ రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఇక ఇత‌ర సినీ హీరోల గురించి చెప్తూ....అల్లు అర్జున్ గురించి చెప్పమంటే ఎనర్జీ, స్టైల్, స్వాగ్ అన్నారు. మహేశ్‌బాబు సూపర్‌స్టార్, ప్రభాస్ బాహుబలి అని వ‌ర్ణించారు. క్రికెట్ దేవుడు సచిన్‌ ఒక లెజెండ్ అని కొనియాడారు.

మ‌రోవైపు ఏపీ రాజ‌కీయాల‌పై కూడా కేటీఆర్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. టీడీపీ, వైసీపీ, జ‌నసేన‌లో మీ ఓటు ఎవ‌రిక‌ని ఓ నెటిజ‌న్ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌శ్నించ‌గా...తనకు ఏపీలో ఓటు లేనందున ఎవరికి ఓటు వేస్తానో చెప్పలేనని బదులిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీని అంధ్రలో విస్తరించే అలోచనలేవీ లేవని చెప్పారు. అంధ్రప్రదేశ్ తమ సోదర రాష్ట్రమని అన్నారు.వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్ర నెటిజన్ చేసిన కామెంట్‌కు ఎన్నికల గురించి వర్రీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ఒబామా తాను అధికంగా ఇష్టపడే రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్‌లో చేరుతారా? అని అడిగిన ప్రశ్నకు ప్రస్తుత మంత్రి పదవితోనే సంతోషంగా ఉన్నా అని జవాబిచ్చారు. రేవంత్‌రెడ్డి గురించి ఒక్కమాట చెప్పమంటే అయన ఎవరు? అని ప్రశ్నించారు.

చదువుకున్నవారు రాజకీయాల్లోకి ఎందుకు రావడంలేదని అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం, ప్రజలు వేరు అనే భావన ఉన్నదని, నిజానికి రెండూ కలిస్తేనే ప్రజాసామ్యమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.  రేవంత్‌రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నారని, ఆయనపై సరైనరీతిలో ప్రతిస్పందించాలని అడిగితే అట్లాంటి చీప్ క్యారెక్టర్లు ఎప్పుడూ ఉంటారని, స్పందించాల్సిన పనిలేదని వివ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English