కేటీఆర్‌ను నెర్వ‌స్‌కు గురిచేసిన ఇవాంకా

కేటీఆర్‌ను నెర్వ‌స్‌కు గురిచేసిన ఇవాంకా

#AskKTR  హ్యాష్ ట్యాగ్‌తో గురువారం రాత్రి ట్విట్ట‌ర్ లైవ్‌లో దాదాపు రెండుగంట‌ల పాటు మంత్రి కేటీఆర్ నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టించారు. ఇందులో వ్య‌క్తిగ‌త అంశాల నుంచి మొద‌లుకొని అనేక అంశాల‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ట్విట్ట‌ర్ లైవ్‌లో ప‌లువురు హాట్ హాట్ ప్ర‌శ్న‌లు అడిగారు. ఇంకొంద‌రు చిలిపి స‌మాధానాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మ‌రికొంద‌రు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను జోస్యం చెప్పారు. అయితే అన్నింటికీ....మంత్రి కేటీఆర్ త‌న‌దైన శైలిలో కూల్‌గా రిప్లై ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్ర నెటిజన్ చేసిన కామెంటుకు ఎన్నికల గురించి వర్రీ లేదని మంత్రి కేటీఆర్ ఒక్క మాట‌లో తేల్చేశారు. టీఆర్ఎస్‌ను అంధ్రలో విస్తరించే అలోచనలేవీ తనకు తెలియవన్నారు. అంధ్రప్రదేశ్ తమ సోదర రాష్ర్టమని పేర్కొంటూ తనకు అక్కడ ఓటు లేనందున టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల్లో ఎవ‌రికి ఓటు వేస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాబోద‌ని మంత్రి చ‌మ‌త్కారంగా స‌మాధానం ఇచ్చారు. ప్రజలే పవన్ కల్యాణ్ రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తారన్నారు.  మంత్రి హరీష్ రావు గురించి అడిగితే మెండి పట్టుదల కలిగిన హార్ఢ్ వర్కింగ్ నాయకుడని మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు.

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ టాస్క్ మాస్ట‌ర్ అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పమంటే సానూకూల ఫలితాలు సాధించే టాస్క్  మాస్టర్ అన్నారు.  తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు సీఎం కేసీఆర్ అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. వ్య‌వసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకే ఏకరాకు 4వేల సబ్సీడీ , రైతు సంఘాలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్  తెలిపారు. 24 గంటల కరెంటు వలన భూగర్జ జలాలు సమస్య  ఏర్పడకుండా అటో స్టార్టర్లను తొలగించాలన్నారు. త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తవుతుందన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాత త‌న‌కు న‌చ్చిన గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు అమెరికా తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా అని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. చ‌దువుకున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదేందుకు అంటే ప్రభుత్వం, ప్రజలు వేరు అనే భావన ఉన్నదని, నిజానికి రెండు కలిస్తేనే  ప్రజాసామ్యమ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీకతంగా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలు, రంగాలను కలుపుకుంటూ సమ్మిళిత అభివృద్ది దిశగా పోతుందని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రక్షణ భూముల సేకరణ కష్టంగా ఉన్నందున స్కైవేల నిర్మాణం అలస్యం అవుతుందన్నారు. పాతబస్తీకి ఖచ్చింతగా మెట్రోరైలు వస్తుందని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నగరంలో డీజిల్ బస్సుల వలన కాలుష్యం పెరుగుతుందని, సిఏన్జీ, ఏల్పీజీ బస్సులు వినియోగం గురించి అడిగితే ఎలక్ర్టికల్ వాహానాలే సరైన పరిష్కారం అన్నారు.  నగరంలో వైఫై ప్రాజెక్టు 1/3 పూర్తి అయ్యిందని , త్వరలోనే మరిన్ని  హట్ స్పాట్లు ఎర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివ‌రించారు.

దేశంలో రెండు పార్టీల‌ వ్యవస్ధ మాత్రమే లేదని మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీనా అనే ప్ర‌శ్న‌కు సమాధానంగా సోనియా రిటైరైన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర కెబినెట్లో చేరుతారా అని ప్ర‌శ్నించ‌గా...ఉన్నదాంతోనే సంతోషంగా ఉన్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని మార్గాల్లో ప్రయత్నించిన తర్వాతే పార్ల‌మెంటులో తమ ఎంపీలు నిరసన తెలిపారన్నారు. రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు ఏన్నటికీ కాదన్నారు. మెట్రో రైల్‌ ప్రారంభం, గ్లోబల్ ఎంట‌ర్ ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్ రెండూ ఒక్క రోజు ఉండడమే ఈ ఏడాది గుర్తిండిపోయే రోజని మంత్రి కేటీఆర్ అన్నారు. జీఈఎస్‌ సదస్సులో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్‌, బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ స‌తీమ‌ణి చెర్రీ బ్లెయిర్ భాగ‌స్వామ్యం పంచుకున్న‌ చర్చను నిర్వహించిన సందర్భంగా నెర్వస్ గా ఫీల్ అయిన్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు