ప్యారెలల్ లైఫ్‌.. శిరీష్‌ ఏమంటున్నాడంటే..

ప్యారెలల్ లైఫ్‌.. శిరీష్‌ ఏమంటున్నాడంటే..

ఎంత మొత్తుకున్నా కూడా.. అల్లు శిరీష్‌ ను ''ప్యారెలల్ లైఫ్‌'' సినిమా భూతం మాత్రం వదలట్లేదు. ఇంటర్యూ ఏదైనా కూడా.. మీడియా ఎవరైనా కూడా.. మీ ''ఒక్క క్షణం''పై వస్తున్న కాపీ ఆరోపణలపై మీరు ఏమంటారు అంటూ అడిగేస్తున్నారు. కాని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. శిరీష్‌ ప్రతీసారి చక్కగా వాటిపై క్లారిటీ ఇస్తున్నారు. పదండి చూద్దాం.

''అవును.. ప్యారెలల్ లైఫ్‌ అనే పాయింట్ ను టచ్ చేసి సినిమాను చేశాం. అయితే అది కాపీ అంటే ఎలా? ఇప్పుడు పునర్జన్మలు నేపథ్యంలో బోలెడన్న సినిమాలు వచ్చాయి. రాజమౌళిగారు మగధీర అండ్ ఈగ తీశారు. కాని విక్రమ్ కె కుమార్ అదే కాన్సెప్టుతో మనం సినిమా తీశారు. అవేవీ ఒక దానితో ఒకటి కాపీ కాదు. ఇప్పుడు మా కథ కూడా అంతే. పునర్జన్మలు.. టైమ్ ట్రావెలింగ్.. గతాన్ని మర్చిపోవడం.. ఇలాంటివన్నీ కాన్సెప్టులు. వీటిని ఉపయోగించి కథ ఏం డిజైన్ చేశాం అనేదే ముఖ్యం. నిజంగానే విఐ ఆనంద్ తీసిన ఒక్క క్షణం సినిమా కాపీ అయితే... రిలీజైన వెంటనే జనాలు ట్రాల్ చేయకుండా ఉంటారా? కంటెంట్ అంతా ఇంటర్నెట్లో ఉన్నప్పుడు.. మేము కాపీ కొట్టేసినా దానిని దాయడం కష్టం. కాని ఒక్క క్షణం మాత్రం ఒరిజినల్ స్టోరీ'' అంటూ వివరణ ఇచ్చాడు అల్లు శిరీష్‌.

మొత్తానికి డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై శిరీష్‌ కు ఉన్న క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. ఒక్క క్షణం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశేలా ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు