వాజ్ పేయి ఎందుకు 'భార‌త‌ర‌త్నం' అంటే..

వాజ్ పేయి ఎందుకు 'భార‌త‌ర‌త్నం' అంటే..

స‌రిగ్గా మూడేళ్ల క్రితం(డిసెంబ‌రు 25న వాజ్ పేయి పుట్టిన రోజు సంద‌ర్భంగా) మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయికి 'భార‌త ర‌త్న' అవార్డును కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, ఈ రాజ‌కీయ కురు వృద్ధుడికి ఆ గౌర‌వం ద‌క్క‌డంలో ఆల‌స్య‌మైంద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వినిపించాయి. ప్ర‌తిప‌క్షాలు కూడా గౌర‌వించే ఈ అప‌ర చాణ‌క్యుడికి ఆ అత్యున్న‌త పుర‌స్కారం ద‌క్క‌కుండా అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్ర‌భుత్వం అడ్డుకుంద‌నే వాద‌న‌లు కూడా వినిపించాయి. విజ‌న్ ఉన్న నాయ‌కుడు వాజ్ పేయికి ఆలస్యంగానైనా ఆ గౌర‌వం ద‌క్క‌డం పై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బీజేపీని ఈ స్థాయికి చేర్చడంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన వాజ్ పేయికి ....2014లో అధికారం చేప‌ట్టిన మోదీ స‌మ‌చితంగానే గౌర‌వించార‌ని బీజేపీ శ్రేణులు కూడా సంతోషించాయి. అయితే, అస‌లు వాజ్ పేయి ప్ర‌త్యేక‌త ఏమిటి? అంద‌రు ప్ర‌ధానుల్లోకి ఆయ‌న ఎందుకు విభిన్నంగా ఉంటారు? ఆయ‌నను భార‌త‌ర‌త్న ఎందుకు వ‌రించింది? అన్న ప్ర‌శ్న‌లకు ఆస‌క్తిక‌ర స‌మాధానాలున్నాయి.

1996లో 13 రోజుల పాటు ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టిన వాజ్ పేయి....ఆ త‌ర్వాత 1998-2004 మ‌ధ్య కాలంలో దేశ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. వాజ్ పేయిలోని స‌మ‌ర్థ‌త‌ను ప‌రీక్షించ‌డానికి అనేక ప‌రిస్థితులు ఆయ‌న‌కు ఎదుర‌య్యాయి. వాట‌న్నింటినీ ఎదుర్కొని,అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొని వాజ్ పేయి ప్ర‌జారంజ‌క పాల‌న‌ను అందించారు. వాజ్ పేయి ప్ర‌ధాని ప‌దవి చేప‌ట్టిన మ‌రుస‌టి ఏడాదే దేశాన్ని భారీ తుపాను అత‌లాకుతలం చేసింది. ఆ త‌ర్వాతి ఏడాది కూడా మ‌రో తుఫాను విరుచుకుపడింది. 1998,99 వ‌రుస తుపానుల నుంచి తేరుకుంటున్న స‌మ‌యంలో 1999 లో దాయాది దేశం పాకిస్థాన్....కార్గిల్ లో క‌య్యానికి కాలు దువ్వింది. అదే ఏడాది పార్ల‌మెంట్ పై ఉగ్ర‌మూక‌ల దాడి జ‌రిగింది. ఆ త‌ర్వాత 2001లో భారీ భూకంపం సంభ‌వించింది. ఆ త‌ర్వాత 2002-2003 మ‌ధ్య కాలంలో 30 సంవత్స‌రాల‌లో ఎన్న‌డూ లేనంతగా క‌రువు కాట‌కాల‌ను దేశ ప్ర‌జ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. 2003లో గ‌ల్ష్ ఆయిల్ వార్-2 వ‌ల్ల చ‌మురు సంక్షోభం ఏర్ప‌డింది. ఇటువంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లో కూడా వాజ్ పేయి తొణ‌క‌లేదు...బెణ‌క‌లేదు. దేశ జీడీపీని త‌గ్గ‌కుండా చూసుకుంటూ త‌న మార్క్ పాల‌న‌ను అందించారు. 2004లో దేశంలో సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ సాధించిన బీజేపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ....ప్ర‌స్తుత జీడీపీ 6.3 మాత్ర‌మే ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు