ట్యాంక్ బండ్ పై గాలి జ‌నార్ద‌న్ రెడ్డి డ‌బ్బులెందుకు పంచారు?

ట్యాంక్ బండ్ పై గాలి జ‌నార్ద‌న్ రెడ్డి డ‌బ్బులెందుకు పంచారు?

మైనింగ్ కింగ్, క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ధ‌న రెడ్డి ప్ర‌త్యేకంగా ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు.  ఆంధ్ర సరిహద్దు దాటి కర్ణాటకలో కూడా మైనింగ్ తవ్వకాలు జరిపార‌నే ఆరోప‌ణ‌ల‌పై గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి దాదాపు 4 సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష అనుభ‌వించి బెయిల్ పై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. బెయిల్ పై విడుద‌లైన గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి ఈ మూడు సంవ‌త్స‌రాల కాలంలో మీడియా ముందుకు ఒక్క‌సారి కూడా రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయనో ఓ మీడియా చానెల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూ లో జ‌నార్ధ‌న్ రెడ్డి అనేక ఆస‌క్తర విషయాలు వెల్ల‌డించారు. తానే త‌ప్పూ చేయ‌లేద‌ని, యూపీఏ ప్ర‌భుత్వం త‌న‌పై క‌క్ష్య సాధింపుతోనే జైలుకు పంపించింద‌ని ఆరోపించారు.

గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి అంటే భ‌క్తి ఎక్కువ‌ని, కాల‌జ్ఞానంపై అమిత‌మైన న‌మ్మ‌కం ఉంద‌ని టాక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ట్యాంక్ బండ్ పై బ్ర‌హ్మంగారి విగ్ర‌హం ద‌గ్గ‌ర కొంత‌మందికి భారీ మొత్తంలో డ‌బ్బులు దానం చేసిన‌ట్లు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. వీటిపై జ‌నార్ధ‌న్ రెడ్డి స‌మాధాన‌మిచ్చారు. దానం చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. తాను క‌ర్ణాట‌క మంత్రిగా ఉన్న‌పుడు ట్యాంకు బండ్‌ మీద విగ్రహాలు చూసేందుకు వెళ్లాన‌ని,  అక్కడ ఉన్న‌ బ్రహ్మంగారి విగ్రహం త‌న‌ను అమితంగా ఆక‌ర్షించింద‌ని చెప్పారు. అపుడు, అక్క‌డ ప‌ని చేస్తున్న కొంత‌మంది స్వీప‌ర్లు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడారని, ఆ సంభాష‌ణ‌లో వారి పేర్ల‌ను అడిగాన‌ని చెప్పారు.

ఆశ్చ‌ర్య‌క‌ర‌మో, దైవ బ‌ల‌మో తెలీద‌ని, వారి పేర్లన్నీ పోలేరు, గోవిందు, సిద్ధయ్య ....ఈ రకంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్ర‌స్తావించిన‌వే వ‌చ్చాయ‌ని గుర్తు చేసుకున్నారు. దీంతో, త‌న‌తో దైవం ఏదో చేయించాల‌ని భావించే వారిని త‌న‌వ‌ద్ద‌కు పంపిన‌ట్లు భావించాన‌ని, అందుకే వారంద‌రికీ దాదాపు రూ.50 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు దానం చేశానన్నారు. వారి పిల్లలకు మంచి చదువు చెప్పించమ‌ని కోరాన‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు