దొంగను పట్టించిన నయనతార

దొంగను పట్టించిన నయనతార

కిర్రెక్కించే అందంతో కళ్లలో నిలిచిపోయే సౌత్ ఇండియన్ బ్యూటీ నయనతార ఎన్ని సినిమాల్లో పోలీసు వేషం వేసిందో... ఎంతమంది నేరస్థుల ఆటకట్టించిందో తెలియదు కానీ ఆమె ఫొటో మాత్రం ఓ దొంగను పట్టించింది. అది కూడా ఆమె గురించి పెద్దగా తెలియని బీహార్లో. అదీ నయన్ లుక్స్ పవర్.

ఇంతకీ ఏం జరిగిందంటే... దర్భంగాలో సంజయ్ కుమార్ అనే బీజేపీ నేత మొబైల్ ఫోన్ ను మొహమ్మద్ హసైన్ అనే దొంగ తీసుకెళ్లాడు. సంజయ్ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు, దొంగ అదే సిమ్ ను వాడుతున్నట్లు గుర్తించారు. అయితే... ఆయన్ను పట్టుకోవడం మాత్రం సాధ్యం కావడం లేదట. దాంతో పోలీసులు ఓ ఎత్తుగడ వేశారు.  ఏఎస్ఐగా పనిచేస్తున్న మధుబాలాదేవితో ప్రేమ నాటకం ఆడించారు.

అయితే.... మహా జాదూ అయిన ఆ దొంగ పోలీసులే ఇలా చేస్తున్నారని మొదట అనుమానించాడట. కానీ... మధుబాల రోజూ ఫోన్ చేసి తియ్యగా మాట్లాడుతుండడంతో కాస్త మెత్తబడ్డాడు. అదే అదనుగా మధుబాల నిన్ను కలుస్తానని దొంగకు ఫోన్లో చెప్పింది. దాంతో ఫొటో పంపించాలని అడిగాడు... అప్పుడు మధుబాల వెతికివెతికి నయనతార ఫొటోను ఎంపిక చేసి పంపించింది. నయన్ ఫొటోకు ఫ్లాటయిన దొంగ హసైన్ ఆమె చెప్పిన చోటికి, చెప్పిన టైమ్ కు వచ్చేశాడు. అప్పటికే అక్కడ సివిల్ దుస్తుల్లో మకాం వేసిన పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అదీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు