ఓహో మీకు అలా అర్థమైందా?

ఓహో మీకు అలా అర్థమైందా?

ఏపీ సీఎం చంద్రబాబు తన గురించి తాను ఎన్ని గొప్పలు చెప్పుకొంటారో అంతకంటే ఎక్కువగా చెప్తారు ఆయన మంత్రివర్గ సహచరులు. బాబు ఘనకార్యాలు, ఘనతలను వారు నిత్యం ప్రజల్లోకి పంపించేందుకు తెగ ప్రయాస పడుతుంటారు. అయితే... అప్పుడప్పుడు ఆ మోతాదు ఎక్కువైతే జనం వద్ద అది బెడిసికొడుతోంది. సెటైర్ల రూపంలో రియాక్షన్ ఇస్తోంది. తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల విషయంలో అలాంటి పరిస్థితే ఎదురైంది.

మంత్రి అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబునాయుడి గొప్పతనాన్ని చెప్పుకొస్తూ ఇంకో సీఎం అయితే, ఆ కుర్చీ వదిలేసి పారిపోయేవారని.. ఆయన పాలన చేపట్టినప్పటి నుంచి అన్ని కష్టాలు వచ్చాయని... అయినా, ఆయన మాత్రం అన్నిటినీ ఎదుర్కొని ముందుకు సాగుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కాకుండా మరొకరు సీఎంగా ఉంటే ఎదురైన సవాళ్లను చూసి ఈపాటికి రాజీనామా చేసి వెళ్లిపోయేవారని అచ్చెన్న అన్నారు. అయితే.... అచ్చెన్న వ్యాఖ్యలపై ఇంటర్నెట్‌లో సెటైర్లు పడుతున్నాయి.

నెటిజన్లు... అచ్చెన్న వ్యాఖ్యలకు ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టారు. చంద్రబాబు కాబట్టే ఓటుకు నోటు కేసు తర్వాత కూడా సీఎం కుర్చీలో సిగ్గు లేకుండా కూర్చున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయి కూడా పదవిలో కొనసాగడం ఇంకెవరికీ సాధ్యం కాదని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఆయన ప్లేసులో ఇంకో సీఎం ఉంటే రాజీనామా చేసేవారని అంటున్నారు. అయితే.. నెటిజన్ల కామెంట్లతో అచ్చెన్న పాపం షాక్ తిన్నారట... ఓహో మీకు అలా అర్థమైందా అని తల పట్టుకున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు