పేరుకే స్పా.. లోప‌ల జ‌రిగేది మాత్రం..?

పేరుకే స్పా.. లోప‌ల జ‌రిగేది మాత్రం..?

ఆరోగ్యం కోసం.. మాన‌సిక ఉల్లాసం కోసం స్పా సేవ‌లు అందిస్తున్న‌ట్లు చెప్పి.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనాలు ఈ మ‌ధ్య‌న కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా హైద‌రాబాద్ లో అలాంటి ఉదంత‌మే మ‌రొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని ఒక స్పా గుట్టు ర‌ట్టు అయ్యింది.

చైత‌న్య‌పురి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని నాగోల్ లో స్టూడియో 11 పేరిట బాడీ స్పా సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నారు. పేరుకు స్పా అయిన‌ప్ప‌టికీ.. లోప‌ల అందిస్తున్న సేవ‌లు మాత్రం అందుకు పూర్తిగా భిన్న‌మ‌న్న వైనం తాజాగా అధికారులు జ‌రిపిన దాడుల‌తో తేలింది. స్పా పేరిట వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లుగా ప‌క్కా స‌మాచారం అందుకున్న ఎల్బీ న‌గ‌ర్ జోన్ ఎస్ వోటీ  పోలీసుల బృందం త‌నికీలు నిర్వ‌హించింది.

ఈ త‌నిఖీల్లో వ్య‌భిచారం చేస్తున్న ఇద్ద‌రు యువ‌కుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మ‌హిళ‌ల్ని రెస్క్యూ హోంకు త‌ర‌లించారు. అదుపులోకి తీసుకున్న యువ‌కుల నుంచి న‌గ‌దు.. సెల్ ఫోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ స్పా (స్టూడియో స్పా) య‌జ‌మాని మ‌ధుసూద‌న్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు.

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం.. కోల్ క‌తాతో పాటు బెంగుళూరుకు చెందిన యువ‌తుల‌కు మాయ‌మాట‌లు చెప్పి వ్య‌భిచారం ముగ్గులోకి  దింపుతున్న‌ట్లు గుర్తించారు. స్పా సేవ‌ల పేరుతో వ్య‌భిచారం న‌డిపే సంస్థ‌లు హైద‌రాబాద్ లో చాలానే ఉన్నాయ‌ని.. పొర‌పాటున వెళితే అడ్డంగా బుక్ కావ‌టం ఖాయం. బీకేర్ ఫుల్ బాస్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు