అమ్మ వీడియో బయటకు ఎలా వచ్చిందంటే

అమ్మ వీడియో బయటకు ఎలా వచ్చిందంటే

అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో ఉన్న అమ్మ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చి సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఒక రోజు ముందు విడుద‌లైన అమ్మ వీడియో పెను క‌ల‌క‌లాన్ని రేపింది. అమ్మ ఆసుప‌త్రిలో ఉన్న వేళ‌.. ఆమె ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో చెప్పాలంటూ కోట్లాది మంది కోరుకున్నా బ‌య‌ట‌కు రాని వీడియో.. ఎప్పుడైతే చిన్న‌మ్మ ప‌ర‌ప‌తికి ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ ప‌రీక్ష‌గా మారిందో.. అమ్మ వీడియో ఇట్టే బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌టంపై ఎన్నిక‌ల సంఘం తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. వీడియోను టెలికాస్ట్ చేయొద్ద‌ని టీవీ ఛాన‌ల్స్‌ను ఆదేశించింది  ఇదిలా ఉంటే ఎమ్మెల్యే వెట్రివేల్ చేతికి అమ్మ వీడియో ఎలా వ‌చ్చింద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదే విష‌యాన్ని తాజాగా శ‌శిక‌ళ మేన‌కోడ‌లు కృష్ణ‌ప్రియ వెల్ల‌డించారు.

అమ్మ ఆసుప‌త్రి వీడియోను దిన‌క‌ర‌న్‌కు జ‌య‌టీవీ సీఈవో వివేక్ ఇచ్చార‌న్నారు. దిన‌క‌ర‌న్ ద్వారా వెట్రివేల్ చేతికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఉన్న‌ట్లుండి వీడియో ఎందుకు విడుద‌ల చేశార‌న్న అంశంపై చిన్న‌మ్మ వ‌ర్గం చేస్తున్న వాద‌న ఆస‌క్తిక‌రంగా మారింది. అమ్మ జ‌య‌ల‌లిత గౌర‌వానికి భంగం వాటిల్లుతుంద‌న్న ఉద్దేశంతోనే వీడియోను విడుద‌ల చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వీడియోను విడుద‌ల చేసిన వెట్రివేల్ తాజాగా ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. చూస్తుంటే.. వీడియో వ్య‌వ‌హ‌రం రానున్న రోజుల్లో అరెస్ట్ ల వ‌ర‌కూ వెళ్లే అవ‌కాశం ఉందంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు