'ద్రౌప‌ది ఏనాడూ భ‌ర్త‌ల మాట విన‌లేదు'

'ద్రౌప‌ది ఏనాడూ భ‌ర్త‌ల మాట విన‌లేదు'

 ఇప్పుడున్న వివాదాలు.. చ‌ర్చ‌లు స‌రిపోవ‌న్న‌ట్లుగా బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ స‌రికొత్త చ‌ర్చ‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. ద్రౌప‌దిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. ద్రౌప‌దిపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

రానున్న రోజుల్లో ఇదో చ‌ర్చ‌నీయాంశం కానుంది. ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి స్త్రీవాదిగా ద్రౌప‌దిని చెప్పొచ్చంటూ రామ్ మాధ‌వ్ వ్యాఖ్యానించారు. ద్రౌప‌ది మొట్ట‌మొద‌టి స్త్రీవాది. పంచ భ‌ర్తృక‌ని.. ఆమె ఎప్పుడూ త‌న ఐదుగురు భ‌ర్త‌ల్లో ఏ ఒక్క‌రి మాట విన‌లేద‌ని.. త‌న‌కు స్నేహితుడు.. శ్రేయోభిలాషి అయిన శ్రీ‌కృష్ణుడి మాట మాత్ర‌మే అనుస‌రించింద‌న్నారు.  మ‌హాభార‌త యుద్ధానికి  ఆమే కార‌ణ‌మ‌ని.. ఆమె ప‌ట్టుద‌ల కార‌ణంగా నాడు జ‌రిగిన యుద్ధంలో 18 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు.

ఒక మ‌హిళ ప‌ట్టుద‌ల కార‌ణంగా 18 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోవ‌టాన్ని మాన‌వ‌త్వానికి మాయ‌ని మ‌చ్చ‌గా ప‌లువురు అభివ‌ర్ణించొచ్చు. ఆమెకు ప‌ట్టుద‌లే లేకుంటే ఐదు ఊళ్ల‌తో ఇష్యూ క్లోజ్ అయ్యేద‌ని పేర్కొన్నారు. యుద్ధంలో 18 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించ‌టానికి ద్రౌప‌తే కార‌ణ‌మ‌ని చెప్పొచ్చ‌ని పేర్కొన్నారు. రామ్ మాధ‌వ్ వాద‌న‌ను ప‌లువురు స్త్రీవాదులు.. ర‌చ‌యిత్రులు త‌ప్పు  ప‌ట్టారు. మ‌రికొంద‌రు రామ్ మాధ‌వ్‌కు అండ‌గా నిలిచారు.

ద్రౌప‌ది త‌న వాద‌న‌ను వినిపించ‌టానికి ఏ ఒక్క అవ‌కాశం ద‌క్క‌లేద‌ని కొంద‌రు అంటే.. భార‌త యుద్ధానికి ద్రౌప‌ది కార‌ణం ఏ మాత్రం కాద‌ని.. అప్ప‌టి పురుష అహంకారం.. మ‌ద‌మే కార‌ణ‌మ‌ని కొంద‌రు మ‌హిళా ర‌చ‌యిత్రులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఏమైనా.. రానున్న రోజ‌ల్లో ద్రౌప‌ది మీద చ‌ర్చ మ‌రింత పెర‌గ‌టం ఖాయ‌మ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు