ఆర్బీఐ మాట ప్ర‌కారం..2వేల నోటు ఇక క‌లే

ఆర్బీఐ మాట ప్ర‌కారం..2వేల నోటు ఇక క‌లే

పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం విప‌ణిలోకి వ‌చ్చిన రూ.2 వేల నోటు త్వ‌ర‌లోనే తెర‌మరుగు కానుందా? త్వరలో రూ.2,000 నోట్లకు మోడీ సర్కారు రద్దు చేయనుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. రిజర్వ్‌బ్యాంకు 2000 రూపాయల నోట్ల పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు కనిపిస్తోందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఇటీవ‌ల‌ లోక్‌సభలో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన నివేదికను, రిజర్వ్‌బ్యాంకు వార్షిక నివేదికను పక్కపక్కన పెట్టి అధ్యయనం చేసినపుడు ఈ విషయం స్పష్టమయ్యిందని తమ నివేదికలో ఎస్‌బీఐ పేర్కొంది.

‘‘పెద్ద నోట్ల రద్దు అనంతరం వెంటనే మార్కెట్లో ద్రవ్య లభ్యత కోసం రూ.2,000 నోట్లు తీసుకురాగా, లావాదేవీల పరంగా సవాళ్లకు దారితీసింది. దీంతో ఆర్‌బీఐ రూ.2,000 నోట్లను ప్రింట్‌ చేయడం ఆపి ఉంటుంది. లేదా తక్కువ సంఖ్యలో ముద్రించి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో చిన్న నోట్ల వాటా 35 శాతానికి చేరింది’’ అని నివేదిక స్పష్టం చేసింది. ‘‘మా పరిశీలన ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,50,100 కోట్ల విలువ మేర చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. డిసెంబర్‌ 8 నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో చిన్న నోట్ల విలువను మినహాయించి చూస్తే పెద్ద నోట్ల విలువ రూ.13,32,400 కోట్ల మేరకు ఉన్నట్లు తెలుస్తోంది.

వాదేవీల సందర్భంగా రూ.2వేల నోట్లతో సమస్యలు ఎదురైనందున, ఆర్బీఐ వాటిని ముద్రించడం నిలిపివేసి ఉండవచ్చు లేదా తక్కువ పరిమాణంలో ముద్రించి ఉండవచ్చనని ఎస్‌బీఐ తెలిపింది. ఆర్థిక శాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడించిన సమాచారం మేరకు ఆర్‌బీఐ ఈ ఏడాది డిసెంబర్‌ 8 నాటికి రూ.500 నోట్లను 16,957 పీసుల మేర ప్రింట్‌ చేసింది. రూ.2,000 నోట్లను 3,654 పీసుల మేర ప్రింట్‌ చేసింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.15,78,700 కోట్లు. ఇందులో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.13,32,400ను మినహాయించి చూస్తే రూ.2,46,300 కోట్ల విలువ మేర పెద్ద నోట్లను ఆర్‌బీఐ ప్రింట్‌ చేసినప్పటికీ మార్కెట్లోకి పంపిణీ చేయలేదని ఎస్‌బీఐ అంటోంది. అని ఈ నివేదికను రూపొందించిన ఎస్‌బీఐ గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ వివరించారు. అయితే, రూ.2,46,300 కోట్ల మేర రూ.50–200 మధ్య నోట్లను ఆర్‌బీఐ ఈ మధ్య కాలంలో ప్రింట్‌ చేసి ఉంటుందని కూడా ఎస్‌బీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు