గుడ్డిగా సంతకాలు పెట్టారన్నమాట

గుడ్డిగా సంతకాలు పెట్టారన్నమాట

వాళ్ళేమీ అక్షరం ముక్క రాని వారు కాదు. రాజ్యాంగ బద్ధంగా మంత్రులైనవారు. ప్రజలకు మేలు చేయడానికి ఎలాంటి ఒత్తిళ్ళనైనా తట్టుకోవాలి. కాని అలా చేయలేదు వారు. ముఖ్యమంత్రి ఒత్తిడి చేశారని సంతకాలు చేశార్ట. తప్పు జరిగిందో లేదోగాని, తప్పు జరిగిందన్న కోణంలో సిబిఐ విచారణ జరుగుతుండగా, మంత్రుల వాదన ఆశ్చర్యం గొలుపుతున్నది.

మేం ఆ సంతకాల వల్ల లాభ పడలేదు, ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చెపితేనే సంతకాలు పెట్టామన్నారు జగన్‌ ఆస్తుల కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు. వారే కాదు, కాంగ్రెసు పార్టీలోని కొందరు నేతలు ఇదే మాట చెప్పడం విడ్డూరంగా ఉంది.

ముఖ్యమంత్రికి ఎదురు చెబితే పదవి ఊడుతుంది. అది నిజం. అలాగని ఎందుకు చేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో తెలియకుండా సంతకాలు చేస్తే ఎలాగ? పైగా తమ తప్పు లేదని బుకాయింపులు. జవాబుదారీతనం లేనివారు పదవుల్లో కూర్చుంటే ఇంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు