థ్యాంక్స్ `అర్జున్ రెడ్డి`...... కేటీఆర్ ట్వీట్!

థ్యాంక్స్ `అర్జున్ రెడ్డి`...... కేటీఆర్ ట్వీట్!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువ నేత‌ల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా జ‌రిగిన జీఈఎస్ సద‌స్సులో కేటీఆర్...సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌డం, ఆయ‌న‌ను ఇవాంకా....అమెరికాలో జ‌రిగే స‌ద‌స్సుకు ఆహ్వానించ‌డం తెలిసిందే. తాజాగా, ఈ యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్......బీడ‌బ్ల్యూ బిజినెస్ వ‌ర‌ల్డ్ 'లీడర్ ఆఫ్ ది ఇయర్` పుర‌స్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కేటీఆర్ పై ప‌లువ‌రు రాజ‌కీయ‌, సినీ రంగ ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. అయితే, కేటీఆర్ పై టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ `అర్జున్ రెడ్డి`(విజయ్ దేవరకొండ) చేసిన ట్వీట్ వైర‌ల్ అయింది.  విజ‌య్ తో పాటు మంచు విష్ణు, కోన వెంక‌ట్, బీవీఎస్ ర‌వి, అబ్బూరి, హ‌రీష్ శంక‌ర్ త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

అంద‌రు సెల‌బ్రిటీల‌లాగే కేటీఆర్ కు విజ‌య్ ట్విట్ట‌ర్ లో విషెస్ తెలిపాడు. ``రామ‌న్నా, `లీడర్ ఆఫ్ ది ఇయర్` అవార్డుకు ఎంపికైనందుకు శుభాకాంక్ష‌లు. భ‌గ‌వంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని స్వార్థపూరితంగా వేడుకుంటున్నా. ఎందుకంటే, మాకు చాలాకాలం మీ  సేవ‌లు కావాలి`` అంటూ విజ‌య్ ట్వీట్ చేశాడు. అయితే, అంద‌రి ట్వీట్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చిన కేటీఆర్....విజ‌య్ ట్వీట్ కు ఫ‌న్నీ రిప్లై ఇచ్చారు. "థ్యాంక్స్ `అర్జున్ రెడ్డి`......మిమ్మల్ని గారు అని సంబోధిస్తే బాగుండ‌దేమో" అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. దీంతో, వీరిద్ద‌రి సంభాష‌ణ ఉన్న ట్వీట్లు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

గ‌తంలో, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను రాక్ స్టార్ గా అభివ‌ర్ణించిన కేటీఆర్....అర్జున్ రెడ్డి చిత్రం పై ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. అటువంటి చిత్రాన్ని, అందులో న‌టించిన విజ‌య్ ను పొగ‌డ‌డం ద్వారా కేటీఆర్ స‌మాజానికి ఏం సందేశ‌మిస్తున్నార‌ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్...కేటీఆర్ కు బంధువు కాబ‌ట్టే ఆ విధంగా పొగిడార‌ని వీహెచ్ ఆరోపించారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు