ఇది ప‌వ‌న్‌కు పెద్ద షాకే

ఇది ప‌వ‌న్‌కు పెద్ద షాకే

జ‌న‌సేన అధినేత‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అనూహ్య‌మైన ట్విస్ట్ ఎదురైంది. 2019 ఎలక్షన్స్ లో పోటీ చేయాలని భావిస్తుండగా, గత కొద్ది రోజుల నుండి బాగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. పలు ప్రాంతాలలో జనసేన కార్యాలయాలను నిర్మించే దిశగా కూడా అడుగులు వేశారు. ఈ క్రమంలో మంగళగిరి మండలం చినకాని లో 3 ఎకరాల స్థలం లీజుకి తీసుకున్నాడు పవన్. ఇక్క‌డ పార్టీ కార్యాల‌యం నిర్మాణం కోసం సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో అనూహ్య‌ వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది.

వివరాలలోకి వెళితే సర్వే నంబర్ 182/1 లోని పది ఎకరాల భూమి తమదని ముస్లిం కుటుంబం చెబుతుంది. వివాదంలో ఉన్న భూమిని యార్లగడ్డ సాంబశివరావు పవన్ కి లీజుకిచ్చారని , దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పవన్ తీసుకున్నారని వారు అంటున్నారు. 1920 నుండి ఈ స్థలం తమ అధీనంలోనే ఉందని ముగ్దుం మొహిద్దీన్, జిక్రియా వారసులు వాపోతున్నారు. 1981 నుండి కోర్టులో వివాదం నడుస్తుందని చెబుతున్న వారు, 1997లో గుంటూరు కోర్టు తమకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. వివాదంలో ఉన్న భూమిలో నిర్మాణాలు చేపట్టొదని ముస్లిం కుటుంబం పవన్ ని కోరారు. మరి దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మ‌రి

కాగా, కొద్దికాలం క్రితం ప‌వ‌న్ పార్టీ కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. కార్యాలయం నిర్మాణానికి భూములు లీజుకు ఇచ్చిన రైతులకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణహితంగా జనసేన కార్యాలయం నిర్మిస్తామన్నారు. ఇక్కడ నిర్మించబోయే కార్యాలయం తనకు దేవాలయంతో సమానం అన్నారు. సమస్యలకు పరిష్కారకేంద్రంగా జనసేన ఆఫీస్ ఏర్పాటు చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలా క్రియాశీలంగా మందుకు సాగుతున‌న క్ర‌మంలో తాజా వివాదం ఆ పార్టీకి ఊహించ‌ని ప‌రిణామం అని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు