బాబుకు జక్కన్న చూపించిన సినిమా ఇదే..

బాబుకు జక్కన్న చూపించిన సినిమా ఇదే..

నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిపుణులతో పాటు ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి సహకారం కూడా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా రాజమౌళి ఆ పని మీదే ఉన్నాడు. ఎట్టకేలకు ఈ మధ్యే చంద్రబాబు బృందానికి తన ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాడు జక్కన్న. అవి ఏ మేరకు ఆమోదం పొందాయో ఏమో కానీ.. ఈ రోజు తాను చంద్రబాబుకు ఇచ్చిన ప్రపోజల్ ఏంటో వీడియో రూపంలో వివరించాడు జక్కన్న. ట్విట్టర్లో దానికి సంబంధించిన వీడియోను రాజమౌళి షేర్ చేశాడు.

శ్రీకాకుళంలోని అరసవెల్లి దేవాలయంలో ఒక సీజన్లో సూర్య కిరణాలు నేరుగా దేవుడి పాదాల మీదికి పడతాయన్న సంగతి తెలిసిందే. తిరుపతిలోని గుడిమల్లం దేవాలయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తన ప్రపోజల్ సిద్ధం చేశాడు జక్కన్న. అసెంబ్లీ లోపల తెలుగు తల్లి విగ్రహం పెట్టి.. దాని మీదికి సూర్య కిరణాలు రిఫ్లెక్ట్ ఏర్పాటుకు సంబంధించి డిజైన్ రూపొందించాడు జక్కన్న.

భవనం పైన పెద్ద అద్దం పెట్టించి దాని మీద సూర్య కిరణాలు పడితే.. అక్కడి నుంచి మధ్యలో ఇటు అటు అద్దాలు పెట్టించి వాటి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యే సూర్య కిరణాలు చివరగా వచ్చి తెలుగు తల్లి విగ్రహానికి తాకుతాయన్నమాట. ఈ మేరకు ఆర్కిటెక్టులతో భవనాన్ని డిజైన్ చేయించాలన్నది రాజమౌళి సలహా. మరి ఈ ప్రపోజల్ కు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు