"నారాయ‌ణ‌"కు రూ.50 ల‌క్ష‌లు ఫైన్

ఒక విద్యా సంస్థ తీరును త‌ప్పు ప‌డుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక‌టి జ‌రిమానా విధిస్తే.. ఆ సంస్థ క‌ట్ట‌కుండా ఉంటుందా?  ఛాన్సే లేదు.. ప్ర‌భుత్వం వేసిన ఫైన్ ను విద్యాసంస్థ కట్ట‌టం ఖాయం. కానీ.. ఏపీలో మాత్రం ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపి.. నారాయ‌ణ విద్యాసంస్థది త‌ప్పు అని తేల్చి ఫైన్ వేసిన త‌ర్వాత కూడా క‌ట్ట‌ని తీరు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

విద్యార్థుల  ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల మీద ఆరోప‌ణ‌లెన్నో. ఏపీ రాష్ట్ర మంత్రి నారాయ‌ణ‌కు చెందిన విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థులు ప‌లువురు గ‌డిచిన కొంత‌కాలంగా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌టం తెలిసిందే. తిరుప‌తిలోని నారాయ‌ణ జూనియ‌ర్ కాలేజీలో బి. కొత్త‌కోట‌కు చెందిన శ్రీ‌హ‌ర్ష అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేస‌కున్నాడు.
ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. నారాయ‌ణ విద్యాసంస్థ‌పై విద్యార్థి త‌ల్లిదండ్రులు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌పై విచార‌ణ‌కు ఆదేశించింది ఏపీ స‌ర్కారు.

ఈ ఎపిసోడ్ లో నారాయ‌ణ జూనియ‌ర్ కాలేజీకి రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. అయితే.. ఈ జ‌రిమానాను నారాయ‌ణ జూనియ‌ర్ కాలేజీ చెల్లించ‌లేద‌ని.. ఒక‌వేళ క‌ట్ట‌ని ప‌క్షంలో అలాంటి కాలేజీల గుర్తింపును ర‌ద్దు చేస్తామ‌ని ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు హెచ్చ‌రిస్తున‌నారు. నారాయ‌ణ జూనియ‌ర్ కాలేజీ క‌ట్టే జ‌రిమానాలో కొంత మొత్తాన్ని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి అందిస్తామ‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన త‌ర్వాత కూడా  ఫైన్ క‌ట్ట‌కుండా ఉండ‌టం ఏమిటో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు