హెచ్‌1బీఃఅమెరికా ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌

హెచ్‌1బీఃఅమెరికా ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌

అగ్ర‌రాజ్యం అమెరికా ఓ తీపిక‌బురు తెలిపింది. హెచ్1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చునని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాలోని పలు సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలంటే సదరు ఉద్యోగులకు హెచ్1బీ వీసా తప్పనిసరిగా ఉండాలి. ఏటా భారత్, చైనా లాంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్తున్న వేలాదిమంది నిపుణులు ఈ వీసాపై అక్కడ ఉద్యోగం పొందుతున్నారు. అయితే ఈ వీసా ఉన్నవారు సాధారణంగా తమ దేశంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో విధులు నిర్వహించవచ్చని హెచ్1బీ వీసాలకు అనుమతినిచ్చే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) స్పష్టంచేసింది.

హెచ్1బీ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేసుకోవచ్చు. కానీ ప్రతి కంపెనీ కోసం ఐ-129 ధ్రువీకరణ తప్పనిసరి అని యూఎస్‌సీఐఎస్ ట్విట్టర్‌లో తెలిపింది. కొత్త ఉద్యోగులు ఈ ఐ-129 పిటిషన్ తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో 65వేల హెచ్1బీ వీసాలను మాత్రమే జారీ చేస్తారు. ప్రభుత్వ పరిశోధన సంస్థలు, లాభాపేక్ష లేని పరిశోధన సంస్థల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఈ పరిమితి వర్తించదు. వారికి అదనంగా ఈ వీసాలు అందిస్తారు. అధ్యక్షుడిగా ట్రంప్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్‌1–బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో ఈబీ5 వీసాలకు ఆదరణ పెరిగింది. ఈ వీసా ప్రోగామ్‌ను 1990లో యూఎస్‌ కాంగ్రెస్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టి నిరుద్యోగ అమెరికన్‌ యువతకు ఉపాధి కల్పించాలి. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని అనుకునేవారికి ఇది నిజంగానే బంగారం లాంటి అవకాశం.

ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్‌1–బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు.  మన దేశం నుంచి చాలామంది ఉద్యోగులు హెచ్1బీ వీసా కోసం పోటీపడుతుంటారు. సాంకేతికపరంగా లేదా సైద్ధాంతికంగా నిపుణులైన విదేశీయులు ఈ వీసా కలిగిఉన్నట్టయితే అమెరికా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. భారత్, చైనా దేశాలకు చెందిన వేలాదిమందిని అమెరికా కంపెనీలు ఈ వీసా ప్రాతిపదికన ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నియమిస్తుండడం సర్వసాధారణం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు