బోర్డు మీద పేర్లే గట్లయితే ఎట్లా సారూ

బోర్డు మీద పేర్లే గట్లయితే ఎట్లా సారూ

హైదరాబాదులో ఇప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 'ప్రపంచ తెలుగు మహాసభలు' నిర్వహించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతే కాకుండా ఈ కార్యక్రమంతో మరోసారి ప్రపంచానికి కెసిఆర్ అండ్ టీమ్ తమ సత్తాను చాటాలని చూస్తున్నారు. అందుకే హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఆ సభల తాలూకు ఏర్పాట్లు ఆల్రెడీ మనల్ని పలకరిస్తున్నాయి.

అంతా బాగానే ఉంది కాని.. ఇప్పుడు కొన్ని హోర్డింగులలో దొర్లుతున్న అచ్చుతప్పులు మాత్రం చాలా కామెడీగా ఉన్నాయి. ముఖ్యంగా జరిగేవి తెలుగు మహా సభలు అయినప్పుడు.. అసలు తెలుగు బాషలోనే అచ్చు తప్పులు ఉంటే.. అది చూడ్డానికి అస్సలు బాగోదు. అక్కడున్న ఓ హోర్డింగ్ చూడండి.. అందుకలో స్వయంగా కెసిఆర్ కు ఇవ్వాల్సిన గౌరవ వాచకం దగ్గరే అదేదో హబీబీ అంటూ పడింది. నిజానికి Hon'ble Chief Minister Of Telangana అనే పదాలను అలాగే తెలుగులో పెట్టకుండా.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని కూడా అచ్చేయొచ్చు. పోనివ్ కన్వర్ట్ చేస్తే చేశారు.. అక్కడ హానరబుల్ అనే పదానికి అన్ని తిప్పలు పడితే ఎలా?

అందుకే ఇప్పుడు ఈ హోర్డింగులు చూస్తున్న యాంటీ టీఆర్ఎస్ వారందరూ.. తెలుగుకు తెగులొచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ లెక్కన చూస్తుంటే రేపు 15వ తారీఖు నుండి జరిగే సభలను కూడా విమర్శించడానికి చాలామంది కంకణం కొట్టుకుని రెడీగా ఉండేలా ఉన్నారే. మరి చూద్దాం వీటన్నింటినీ కెసిఆర్ ఎలా తిప్పికొడతారో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు